మెదక్ జిల్లా చరిత్ర
కాకతీయుల కాలంలో మెదక్ జిల్లా ఉచ్ఛ స్థితిలో ఉండేది. మెదక్ ఒకప్పుడు సిద్దాపూర్‌గా పిలువబడేది. కాకతీయుల కాలం నాటి దుర్గం మెదక్ లో నేటికీ ఉంది. నర్సాపూర్, రామాయంపేట, గజ్వేల్, తూప్రాన్, శంకరంపేట వంటివి ముఖ్య పట్టణాలు. బ్రిటిష్ కాలంలో మెదక్ లో నిర్మించిన చర్చి చెప్పుకోదగ్గది. గతంలో 47 రెవిన్యూ మండలాలుగా విభజించారు.
విభజన తర్వాత…
తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల నిర్మాణం, పునర్య్వస్థీకరణ చేపట్టింది. అందులో భాగంగా మెదక్ జిల్లా పరిధిలో పునర్య్వస్థీకరణ ముందు ఉన్న 47 పాత మండలాలు నుండి 19 మండలాలతో సంగారెడ్డి, 13 మండలాలతో సిద్దిపేటను జిల్లాలుగా ఏర్పటు చేసి, 15 పాత మండలాలుతో మెదక్ జిల్లాను పునర్య్వస్థీకరించారు.