బిఆర్ఎస్ తిన్నదంతా కక్కిస్తా…

Screenshot 20231003 235348 WhatsApp

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై విరుసుకు పడ్డారు. ఎన్డీఏ లో చేరతానని  కేసీఆర్‌ వెంటపడ్డారనీ, ఆ ప్రతిపాదనను తాను ఒప్పుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్  జిల్లాలో ఏర్పాటు చేసిన “జనగర్జన” సభలో మోదీ మాట్లాడుతూ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ ఢిల్లీ వచ్చి,తెలంగాణ పాలన పగ్గాలు మంత్రి కేటీఆర్‌కు ఇస్తానని చెప్పినట్టు మోడీ వెల్లడించారు. కేటీఆర్‌ను ఆశీర్వదించాలని కోరినప్పుడు, ఇది రాజరికం కాదు, ఇది ప్రజాస్వామ్యమని చెప్పి మీరేమైనా రాజులా అని ప్రశ్నించినట్టు మోడీ వివరించారు.

ప్రజలు ఆశీర్వదిస్తేనే పాలకులు అవుతారనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోబోమని కేసీఆర్‌కు తేల్చి చెప్పినట్టు తెలిపారు. నాటి నుంచి నా కళ్లలోకి చూడ్డానికి కూడా కేసీఆర్ భయపడుతున్నాడని మోడీ చెప్పారు.
గతంలో హైదరాబాద్ ఎన్నికలపుడు నాతో అప్యాయంగా ఉన్నాడు. ఆర్భాటంగా స్వాగతం పలికాడని ప్రధాని పేర్కొన్నారు. మా అవసరం తీరాక ఆయన ప్రవర్తన మారిందని, మా కార్యకర్తలను ఎన్ని రకాలుగా వేధించినా భయపడేది లేదన్నారు. తెలంగాణను ఓ కుటుంబం దోచుకుంటోందనీ,  తెలంగాణ వచ్చాక ఒక కుటుంబమే బాగుపడిందనీ, ఎంతో మంది బలిదానాలతోనే తెలంగాణ సాకారమైందనీ దుయ్యబట్టారు. కేసీఆర్‌ పాలనలో అవినీతి పెరిగింద. కేసీఆర్‌, ఆయన కుమారుడు, ఆయన కుమార్తె, అల్లుడు మాత్రమే ధనికులయ్యారని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులనూ బీఆర్ఎస్ దోచుకుంటోందనీ, కుటుంబ పాలనకు ప్రజలు మరో అవకాశం ఇవ్వొద్దనీ కోరారు. ఉద్యోగాల్లో అసలైన యువతకు అవకాశం రావడం లేదనీ, వచ్చే ఎన్నికలలో నమ్మకం ఉంచి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. తమకు అధికారం ఇస్తే బీఆర్ఎస్ దోచుకున్నదంతా కక్కిస్తామని అని మోదీ వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *