ఆంధ్రప్రదేశ్ లో తెలుగదేశం, జనసేన మధ్య పొడపొచ్చలు వచ్చినట్టు కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు రిమాండ్ తో రాజమండ్రి కేంద్ర కారాగారానికి వెళ్ళగానే హుటహుటీన బాబుని జైలులో కలిసి వచ్చే ఎన్నికలలో టిడిపితో పొత్తు పెట్టుకుంటున్నట్టు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన సరళి మారిందా అనే సందేహం తలెత్తుతోంది. సుమారు 15 రోజులుగా చంద్రబాబుకు సంబంధించి పవన్ నుంచి ఒక్క ప్రకటన కూడా వెలుగు చూడక పోవడంతో ఆయా పార్టీ శ్రేణులు సందిగ్ధంలో పడ్డాయి.ఇటు బాబు బెయిల్ పిటిషన్ పై, అటు రింగురోడ్డు, అంగళ్ళ ఆరోపణలపై జనసేన నోరు మెదపక పోవడం చర్చనీయాంశంగా మారింది. బాబు అరెస్టు అక్రమం అని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు పెల్లుబుకుతుంటే తెలుగుదేశంతో అంటగట్టుకున్న జనసేన ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా వచ్చే నెల మొదటి వారం నుంచి పవన్ కళ్యాణ్ మొదలుపెట్టే వారాహి యాత్రలో పొత్తు ప్రస్తావన ఎలా ఉంటుందో అని రెండు పార్టీల శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ఆ పొత్తు నిజమేనా…!
