pitapur c

“దాశరథి”గా మారిన “చేగువేరా”…!

తెలుగునాట అత్యంత ప్రాబల్యం ఉన్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం పై నటులు, జనసేన నేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చలకు దారి తీశాయి. నలభై ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీని మొన్నటి ఎన్నికల్లో గెలిపించింది “సేన” అంటూ పిఠాపురంలో పవన్ సాగించిన ప్రసంగం టిడిపి శ్రేణుల్లో అసంతృప్తి రేకెత్తించింది. గత ఎన్నికల్లో కౌంటింగ్ రోజు వరకూ పిఠాపురంలోనే గెలవడం కష్టతరం అనే సందిగ్ధంలో ఉన్న పవన్, ఆయన పార్టీ పోటీ చేసిన…

Read Full News
pawan pan c

కదులుతున్న బిజెపి “పావు”..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ “సనాతన ధర్మ పరిరక్షణ” పర్యటనకు ముహూర్తం ఖరారైంది. ఆయన ఈ నెల 12వ తేది నుంచి కేరళ, తమిళనాడులో సనాతన ధర్మ బాట పట్టనున్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో నాలుగు రోజులు పాటు వివిధ దేవాలయాలను సందర్శిస్తారు. మొదట కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వెళ్తారు. అక్కడి నుంచి తమిళనాడు లోని మధుర మీనాక్షి, శ్రీపరుశరామస్వామి, అగస్థ్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై…

Read Full News
CHIRU C

“అందరివాడు” క్లైమాక్స్ ఏమిటి..!

నటునిగా ఆయనకు తిరుగు లేదు. 70 ఏళ్ల వయస్సు మీద పడుతున్నా, పాత తరానికే కాదు, నేటి యువతరానికి కూడా ఆయన తెరపై కనిపిస్తే ఆ మజానే వేరు. సినిమా హిట్టు, ప్లాప్ లతో సంబంధం లేదు. ఆయన బొమ్మ, స్టెప్పులు మాత్రమే చాలు అంతే అదే లెక్క. . అయితే, తనకున్న అశేష ప్రేక్షక ఆదరణతో ఏదో ఆశించి, ఎంతో ఊహించి”చిరు”వేచిన తప్పటడుగు రాజకీయ తెరపై మాత్రం కోలుకోలేని “ప్లాప్” ని ఇచ్చింది. ఉదయించే సూర్యుడు…

Read Full News
sry govinda cf

“గోవిందా”… మన్నించు….!

కృత, త్రేతా, ద్వాపర యుగాలను ఏలిన ఓ స్వామి… నీకు కలియుగ పోకడలు తెలియనివి కాదు. ఈర్ష్య ద్వేషాలు, కుళ్ళు, కుతంత్రాలు, ఎత్తులు-పై ఎత్తులు ఆనాటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతున్న సంగతి జగమెరిగిన సత్యమే. కాకపోతే, ఈ కలియుగంలో అవి కాస్తా పరాకాష్టకు చేరడం ఏడు కొండల మీద నిశ్చల రూపుడివైన నిన్ను కన్నెర్రకు గురిచేశాయి. సందేహం లేదు..సకల జనుల సంతోషాన్ని కోరే నీకు ఆగ్రహం తెప్పించే అనేక విషయాలు తిరు గిరులను చుట్టు ముడుతున్నాయి.  పవిత్ర…

Read Full News
Screenshot 20241203 094717 WhatsApp

అలల మధ్యకు సరే.. అడవి బిడ్డలు మరి..!

గ్రామీణ ప్రాంతాల్లో వెలుగు చూస్తున్న కొన్ని సంఘటనలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా లేక అండమాన్ అడవుల్లో బతుకుతున్నామా అనే సందేహం కలుగుతోంది. వందల, వేల కోట్ల రూపాయల లెక్కలతో గ్రామ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నట్టు చెబుతున్న ప్రభుతానికి అడవి బిడ్డల గోడు పట్టకలోవడం విచారకరం. విశాఖ జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చిన హృదయ విదారక ఘటనే పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ పనితీరుని ప్రశ్నిస్తోంది. వైట్ కాలర్ దొంగలను వెతకడానికి పడవలు వేసుకొని…

Read Full News
IMG 20241104 WA0003

“హోమ్”ఇస్తే ఏం చేస్తావ్..?”

హోమ్ శాఖ మంత్రి ఐయితే ఏం చేస్తారు? జగన్ మీద ఉన్న కేసుల పై పోరాడుతారా? చంద్రబాబుపై ఉన్న కేసులను కొట్టి వేస్తారా? తమిళనాడులో మీ పై ఉన్న కేసు నుంచి బయటికి వస్తారా? వివేకానంద హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ ని అరెస్టు చేస్తారా? రోజా పై కక్ష సాధిస్తారా? కొద్ది రోజులుగా అధికమైన అత్యాచారాలను దగ్గరుండి అదుపు చేస్తారా? మీ ఆలోచనలో అంతరార్ధం ఏమిటి? ఒక దళిత మహిళ ప్రాముఖ్యమైన స్థానంలో ఉండడం…

Read Full News
chegu cf

“చె గువేరా”ని చెరిపేస్తున్న”పవని”జం..

“చె గువేరా” ఆలోచనలు అంటూ జనసేనకి హైదరాబాద్ లో పురిటి నొప్పులు పోసిన పవన్ కళ్యాణ్ తన పోరాట మార్గాన్ని మార్చుకున్నారా? సంపాదన అక్కర లేదంటూ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన “తమ్ముడు” ఆలోచనా సరళి ఎందుకు మారింది. “చెగువేరా” ఎక్కడ.. సనాతన ధర్మం ఎక్కడ? పొంతన లేని అంశాలను పవన్ ఎందుకు ఎంచుకున్నారు? భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి దగ్గర కావడానికా? లేక తెలుగు దేశాన్ని కాదనే సొంత ఎజెండా ఎదైనా ఉందా? లేక మొన్నటి ఎన్నికల్లో…

Read Full News
IMG 20240624 WA0075

అక్కడ మంత్రి – ఇక్కడ నిర్మాత…

కాలం చక్రం గమ్మత్తుగా ఉంటుంది. పవన్ కళ్యాణ్, సుప్రియాల మొదటి చిత్రం “అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి”. అందరికీ తెలిసిన సంగతే. ఆ తర్వాత సుప్రియ తెర వెనక్కి వెళ్ళారు. పవన్ మాత్రం “పవార్ స్టార్”గా ఎదిగారు. ఇదీ తెలిసిన విషయమే. రెండు దశాబ్దాల తర్వాత ఇద్దరూ కెమెరా ముందు కనిపించారు. కానీ నటులుగా మాత్రం కాదు..పవన్ ఉప ముఖ్యమంత్రి హోదాలో, సుప్రియ నిర్మాతగా కలుసుకున్నారు.

Read Full News
nda babu

సదా మీ సేవలో…

విజయవాడలో ఏ కనెక్షన్ లో కూటమి ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధినేతను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని శాసన సభ పక్ష నాయకునిగా ఎన్నుకున్నారు. చంద్రబాబు నాయుడు పేరును పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించగా పురంధరేశ్వరి, అచ్చెన్నాయుడు బలపరిచారు.అదేవిధంగా కూటమి ఎమ్మెల్యేలు దీనికి ఆమోదం తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, కూటమికి చెందిన ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Read Full News
Trayam c

తెలంగాణాలో”విడి”- ఆంధ్రాలో”కలివిడి”..

తెలంగాణలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీల వైఖరి అంతుపట్ట కుండా ఉంది. అంధ్రప్రదేశ్ లో చేతులు కలిపిన ఆ మూడు పార్టీలు తెలంగాణాలో మాత్రం విడి పోయినట్టు కనిపిస్తోంది. తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో నానా హంగామా చేసిన జనసేన పార్టీ ఈ లోక్ సభ ఎన్నికల్లో పతా లేకుండా పోయింది. అప్పట్లో తెలుగుదేశంతో సన్నిహితంగా ఉంటూనే చంద్రబాబు నాయుడుకి మాట మాత్రం చెప్పకుండా ఏకపక్ష నిర్ణయంతో జనసేన ఎన్నికల…

Read Full News
IMG 20240317 WA0086

మాకే మీ ఓటు…!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలని, దేశంలో ఈసారి 400 సీట్లు దాటాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆంధ్ర్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా బొప్పూడిలో టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. “నా ఆంధ్ర కుటుంబసభ్యులు అందరికీ నమస్కారం” అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని మోదీ ప్రారంభించారు. దేశంలో ఈసారి ఎన్డీఏకు 400 సీట్లు దాటాలని, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలని మోదీ అన్నారు. అభివృద్ధి చెందిన…

Read Full News
chanakyam c

అంతుపట్టని”బాబు”చాణక్యం..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతోంది? ఒకప్పుడు జాతీయ రాజకీయాలను శాసించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాణక్యం ఎక్కడ దాచుకుంది? నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న”బాబు” కేవలం దశాబ్ద కాలంగా రాజకీయ తెరపై కనిపిస్తున్న అమిత్ షా కోసం ఎందుకు పడిగాపులు కాశారు? బాబు ఎన్.డి.ఏ. కన్వీనర్ గా  ఉన్నప్పుడు అసలు ఏం జరిగింది? ఆ పర్యవసానమే ప్రస్తుత ఫలితమా?  ఇలాంటి అనేక ప్రశ్నలకు ఆంధ్రా రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయి రాజకీయ…

Read Full News
4th cf

నా నాలుగో పెళ్ళాం “జగన్”…

ప్రజా సమస్యల పై పోరాడాల్సిన రాజకీయ పార్టీ నేతలు వ్యక్తిగత వ్యవహారాలను తెరపైకి తీసుకురావడం వింతగా కనిపిస్తోంది. అదీ ఏదో చిన్నా చితకా సరదా వ్యాఖ్యలు కాదు.. ఏకంగా పెళ్ళిళ్ళు, పెళ్ళాల వరకు వెళ్ళడం రాజకీయ పరిపక్వత లోపాన్ని ఎత్తిచూపుతున్నాయి. సరిగ్గా ఇదే తంతు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ వైఎస్ జగన్ సారధ్యంలోని అధికార పార్టీ వైసీపీకి, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనెలా ఉంది. ముఖ్యమంత్రి జగన్…

Read Full News
banana c

రాజకీయాల్లో”అరటి పండ్లు”…!

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో “అరటి పండు”పార్టీల ఎత్తుగడలు అంతుపట్టకుండా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నడిపిస్తున్న జనసేన, వై.ఎస్.షర్మిల ఆధ్వర్యం లోని వై.ఎస్.ఆర్.తెలంగాణ (వైఎస్ఆర్ టి) పార్టీలు ఎన్నికల సమయంలో వ్యవహరిస్తున్న తీరు రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి మొదలవ్వగానే తమ బలం ఎంత ఉన్నదనే కనీస విషయాన్ని అంచనా వేసుకోకుండా బరిలోకి దిగడం వెనుక అసలు రహస్యం ఏమిటనే  కోణంలో చర్చలకు తెర లేస్తోంది. తెలంగాణ శాసనసభకు గత నెలలో జరిగిన…

Read Full News
ana

చిన్నారులతో “అనా”…

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గా సతీమణి అనా కొణిదెల ప్రీ క్రిస్మస్ వేడుకలను అనాథ హైదరాబాద్ లోని ఒక శరణాలయంలో నిర్వహించారు. బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్ ఫర్ ద చిల్డ్రన్ లోని చిన్నారులతో ముచ్చటించి వారి విద్యాబుద్ధుల గురించి తెలుసుకున్నారు. ఆనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేశారు. నిత్యావసర సరుకులను అందచేశారు. అనాను హోమ్ నిర్వాహకులు సత్కరించారు.

Read Full News