chegu cf

“చె గువేరా”ని చెరిపేస్తున్న”పవని”జం..

“చె గువేరా” ఆలోచనలు అంటూ జనసేనకి హైదరాబాద్ లో పురిటి నొప్పులు పోసిన పవన్ కళ్యాణ్ తన పోరాట మార్గాన్ని మార్చుకున్నారా? సంపాదన అక్కర లేదంటూ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన “తమ్ముడు” ఆలోచనా సరళి ఎందుకు మారింది. “చెగువేరా” ఎక్కడ.. సనాతన ధర్మం ఎక్కడ? పొంతన లేని అంశాలను పవన్ ఎందుకు ఎంచుకున్నారు? భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి దగ్గర కావడానికా? లేక తెలుగు దేశాన్ని కాదనే సొంత ఎజెండా ఎదైనా ఉందా? లేక మొన్నటి ఎన్నికల్లో…

Read More
hariprsad mlc

సంక్షేమం కోసం కృషి చేస్తా

రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని శాసన మండలి సభ్యులు పి. హరిప్రసాద్ స్పష్టం చేశారు. ఎన్డీయే కూటమిలో భాగంగా జనసేన తరఫున నామినేషన్ దాఖలు చేసిన హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించారు. అనంతరం పి. హరిప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ “ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. శాసన మండలి సభ్యత్వాన్ని బాధ్యతా యుతమైన పదవిగా భావిస్తున్నాను. నా మీద నమ్మకంతో…

Read More
Trayam c

తెలంగాణాలో”విడి”- ఆంధ్రాలో”కలివిడి”..

తెలంగాణలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీల వైఖరి అంతుపట్ట కుండా ఉంది. అంధ్రప్రదేశ్ లో చేతులు కలిపిన ఆ మూడు పార్టీలు తెలంగాణాలో మాత్రం విడి పోయినట్టు కనిపిస్తోంది. తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో నానా హంగామా చేసిన జనసేన పార్టీ ఈ లోక్ సభ ఎన్నికల్లో పతా లేకుండా పోయింది. అప్పట్లో తెలుగుదేశంతో సన్నిహితంగా ఉంటూనే చంద్రబాబు నాయుడుకి మాట మాత్రం చెప్పకుండా ఏకపక్ష నిర్ణయంతో జనసేన ఎన్నికల…

Read More
IMG 20240403 WA0028

ప్రచారమా…మజాకా..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెనాలి పర్య టన రద్దయింది. తెనాలిలో నిర్వహించాల్సిన రోడ్ షో, బహిరంగ సభను జనసేన రద్దు చేసింది. పవన్ కల్యా ణ్ అస్వస్థతకు గురికావడ మే దీనికి కారణం. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు.పిఠాపురంలో మండుటెండ లో ప్రచారాన్ని నిర్వహించిన పవన్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధ పడుతున్న ఆయన చికిత్స కోసం హైదరాబాద్ కు పయనమయ్యారు. దీంతో, ఆయన ప్రచారానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. తెనాలితో పాటు, రేపు నెల్లిమర్లలో…

Read More
IMG 20240317 WA0086

మాకే మీ ఓటు…!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలని, దేశంలో ఈసారి 400 సీట్లు దాటాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆంధ్ర్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా బొప్పూడిలో టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. “నా ఆంధ్ర కుటుంబసభ్యులు అందరికీ నమస్కారం” అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని మోదీ ప్రారంభించారు. దేశంలో ఈసారి ఎన్డీఏకు 400 సీట్లు దాటాలని, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలని మోదీ అన్నారు. అభివృద్ధి చెందిన…

Read More
chanakyam c

అంతుపట్టని”బాబు”చాణక్యం..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతోంది? ఒకప్పుడు జాతీయ రాజకీయాలను శాసించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాణక్యం ఎక్కడ దాచుకుంది? నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న”బాబు” కేవలం దశాబ్ద కాలంగా రాజకీయ తెరపై కనిపిస్తున్న అమిత్ షా కోసం ఎందుకు పడిగాపులు కాశారు? బాబు ఎన్.డి.ఏ. కన్వీనర్ గా  ఉన్నప్పుడు అసలు ఏం జరిగింది? ఆ పర్యవసానమే ప్రస్తుత ఫలితమా?  ఇలాంటి అనేక ప్రశ్నలకు ఆంధ్రా రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయి రాజకీయ…

Read More
4th cf

నా నాలుగో పెళ్ళాం “జగన్”…

ప్రజా సమస్యల పై పోరాడాల్సిన రాజకీయ పార్టీ నేతలు వ్యక్తిగత వ్యవహారాలను తెరపైకి తీసుకురావడం వింతగా కనిపిస్తోంది. అదీ ఏదో చిన్నా చితకా సరదా వ్యాఖ్యలు కాదు.. ఏకంగా పెళ్ళిళ్ళు, పెళ్ళాల వరకు వెళ్ళడం రాజకీయ పరిపక్వత లోపాన్ని ఎత్తిచూపుతున్నాయి. సరిగ్గా ఇదే తంతు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ వైఎస్ జగన్ సారధ్యంలోని అధికార పార్టీ వైసీపీకి, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనెలా ఉంది. ముఖ్యమంత్రి జగన్…

Read More
babu pwn kodi

పందెం “కోళ్ళు”…

ఆంధ్రప్రదేశ్ లోని మందడం గ్రామంలో జరిగిన భోగి వేడుకల్లో టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొని సందడి చేశారు. గంగిరెద్దు కళ్ళాలు పట్టుకొని పవన్ “డూ…డూ…బసవన్న”అనగా ఆ పక్కనే చంద్రబాబు నాయుడు విజయం మనదే అన్నట్టు సంకేతం చూపడం ఆకర్షణగా నిలిచింది.

Read More
banana c

రాజకీయాల్లో”అరటి పండ్లు”…!

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో “అరటి పండు”పార్టీల ఎత్తుగడలు అంతుపట్టకుండా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నడిపిస్తున్న జనసేన, వై.ఎస్.షర్మిల ఆధ్వర్యం లోని వై.ఎస్.ఆర్.తెలంగాణ (వైఎస్ఆర్ టి) పార్టీలు ఎన్నికల సమయంలో వ్యవహరిస్తున్న తీరు రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి మొదలవ్వగానే తమ బలం ఎంత ఉన్నదనే కనీస విషయాన్ని అంచనా వేసుకోకుండా బరిలోకి దిగడం వెనుక అసలు రహస్యం ఏమిటనే  కోణంలో చర్చలకు తెర లేస్తోంది. తెలంగాణ శాసనసభకు గత నెలలో జరిగిన…

Read More
babu pavan

నగరంలో వ్యూహం…

ఆంద్రప్రదేశ్ రాజకీయల చర్చలు హైదారాబాద్ కేంద్రంగా మొదలయ్యాయి. తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నగరంలోని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లారు. ఇద్దరూ తాజా రాజకీయ పరిస్థితులు, రెండు పార్టీల పొత్తుల వ్యవహారం పై చర్చించారు. వైఎస్సార్​సీపీ విముక్త ఆంధ్రప్రదేశే ప్రధాన అజెండాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్​ ఆదివారం రాత్రి కీలక చర్చలు జరిపారు. ఇరువురి నేతల మధ్య జరిగిన అంతర్గత భేటీలో 4 ప్రధాన…

Read More
glass copy

“గ్లాసు” ముట్టని ఓటరు…!

తెలంగాణ ప్రాంతంలో  మేకపోతు గాంభీర్యం చూపించిన జనసేన పార్టీని ప్రజలు ఖాతరు చేయలేదు. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్టు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఆ పార్టీ క్యాడర్ ఒక్కసారిగా న్యూట్రల్ మోడ్ లోకి వెళ్ళింది. కనీసం ఆంధ్రాలో మాదిరిగా ఇక్కడ కూడా జనసేనతో బరిలోకి దిగుతుందేమో అని అంచనా వేశారు. కానీ, తెలుగుదేశంతో సంబంధం లేకుండా తెలంగాణలో జనసేన ఒంటరిగానే రంగంలోకి దూకే ప్రయత్నం చేసింది. అందుకే 32 స్థానాల్లో పోటీ చేస్తుందని…

Read More
yuvac

మళ్లీ జన”గళం’….!

ఆంధ్రప్రదేశ్ లో  ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ జనగళమే “యువగళం”గా యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 79రోజుల సుదీర్ఘ విరామానంతరం మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టబోతోంది. జగన్మోహన్ రెడ్డి అరాచకపాలన, అవినీతి బాగోతాన్ని ఎండగడుతున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు నైపుణ్య అభివృద్ధి కేసులో  జైలుకు  వెళ్ళడంతో అనివార్య పరిస్థితుల్లో సెప్టెంబర్ 9వ తేదీన కోనసీమలోని రాజోలు నియోజకవర్గం పొదలాడ వద్ద యువనేత లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. తర్వాత దేశ రాజధాని డిల్లీలో జగన్మోహన్…

Read More
sena ycp

నిలకడ లేని “పవన్”…

పవన్ కళ్యాణ్ ని నమ్ముకుంటే అందర్ని రోడ్డునపడేసి నట్టేట ముంచుతాడని జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ కు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పసుపులేటి సందీప్,జనసేన పార్టీ రాయలసీమ రీజియన్ సమన్వయకర్త పసుపులేటి పద్మావతిలు ఆరోపించారు.ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో వారు వైయస్సార్ సిపిలో చేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వైఖరిపై పలు ప్రశ్నలు కురిపించారు. అందర్ని ప్రశ్నిస్తానని,రాజకీయాలలో మార్పు తెస్తానని చెప్పే పవన్ లో నిలకడలేదని, ధైర్యం…

Read More
pawan 56

“కమల”దళంతో కనిపించని “తమ్ముడు”…!

తెలంగాణ శాసన సభ ఎన్నికల తేదీ సమీపిస్తున్నా ప్రచారంలో జనసేన జాడ కనిపించక పోవడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదుర్చుకొని తొమ్మిది నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ప్రచార తెరపై కనిపించక పోవడంతో ఆ పార్టీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నాయి.  రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజక వర్గాల్లో భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీలు ప్రచారంలో దూసుకు పోతుంటే జనసేనా కనీసం…

Read More
sena bjp

“దేశం-సేన” పొత్తుపై తెలంగాణ ప్రభావం…?

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన పొత్తుపై తెలంగాణ ఎన్నికల ప్రభావం పడే సూచనలు కనిపిస్తున్నాయా? జనసేన వ్యవహార శైలి దీనికి దారి తీసే అవకాశం ఉందా? తెలంగాణలో జనసేన బిజెపితో అంటకాగుతున్నతీరు తెలుగుదేశం అధినాయకత్వానికి మింగుడు పడడం లేదా? పొత్తుల విషయంలో జనసేన ఏకపక్షంగా, దూకుడుగా వ్యవహరిస్తోందా? రాజమండ్రి సెంట్రల్ జైలులో కలిసిన టిడిపి,“సేన” చేతుల పట్టుసడలే ప్రమాదం ఉందా? ఇలాంటి అనేక  ప్రశ్నలకు రాజకీయ పరిశీలకుల నుంచి అవుననే సమాధానం వస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత…

Read More