విద్యారంగంలో ఆన్ లైన్ ద్వారా శిక్షణ పొందాలనుకునే అభ్యర్ధుల పేరుతో మార్కెట్లోకి వచ్చిన బైజూస్ అనే సంస్థ వివిధ రకాల అక్రమాలకు పాల్పడినట్టు సమాచారం అందుంతోంది. ప్రాథమిక, డిగ్రీ వంటి విద్యార్థులకు ఆన్ లైన్ పాఠాలు బోధించే నెపంతో ప్రారంభమైన ఈ సంస్థ కొంత కాలంగా తాహతకు మించి సివిల్స్ కు హాజరయ్యే వారికి సైతం ఆన్ లైన్ లో శిక్షణ ఇవ్వడానికి పూనుకుంది. సరైన శిక్షణ సిబ్బంది లేనున్నా, యూపిఎస్ కి చెందిన బోధనా సామగ్రి సమకూర్చడంలో సరైన ప్రమాణాలు పాటించకుండా బైజూస్ అభ్యర్ధుల నుంచి ఇబ్బడిముబ్బడిగా ఫీజులు దండుకుంది.నిత్యం కాల్ సెంటర్ ద్వారా అభ్యర్థులను వేధిస్తూ సివిల్స్ కు శిక్షణ పేరుతో లక్షల రూపాయలు పోగుచేసుకుంది. ఆ సంస్థ కార్యకలాపాల పై అనుమానం వచ్చిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు జరపడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఈ సంస్థ విదేశీ నిధుల దుర్వినియగానికి పాల్పడిందని ఇ. డి. అధికారులు సోదాలు నిర్వహించారు.అప్పటి నుంచి బైజూస్ తన కార్యకాపాలను ఒక్కొక్కటిగా తగ్గిస్తూ వస్తోంది. ఎప్పుడో ఈ ఏడాది మొదట్లో ప్రాథమిక సభ్యత్వం పొందిన వివిధ గ్రూపుల అభ్యర్థులను వేదించడం మొదలు పెట్టింది. ఈ సంస్థ హామీ ఇచ్చిన సదుపాయాలను సకాలంలో కల్పించకుండా ఇ.ఎం.ఐ.లను చెల్లించాలని వేదిస్తున్నట్టు కొందరు అభ్యర్ధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు సకాలంలో స్టడీ మెటీరియల్ అందలేదని, ఇదే విషయన్ని సంస్థకు చెప్పడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా స్పందన లేదని పేర్కొంటున్నారు. ఎంతో నమ్మకంతో ఇ.ఎం.ఐ. ఫారాల పై సంతకాలు చేయడాన్ని ఇప్పుడు ఆ సంస్థ వేదింపులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇష్టం లేదని, సభ్యత్వాన్ని రద్దు చేయండని సంస్థ ఇచ్చిన 15 రోజుల గడువు లోపే ప్రయత్నించినా ఏ ఒక్కరూ స్పందించకుండా పథకం ప్రకారం ఇప్పుడు వేదింపులకు పాల్పడుతున్నారని వివరించారు. ఇష్టం లేని తమను ఇలాగే వేధిస్తే హైదరాబాద్, బెంగుళూరు లోని బైజూస్ కార్యాలయాల వద్ద ధర్నా చేపడతామని అభ్యర్ధులు తేల్చి చెబుతున్నారు. అంతేకాక , వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు బైజూస్ తన సంస్ధ లో పనిచేస్తున్న సిబ్బందిలో సుమారు నాలుగు నుంచి ఐదు వేల మందిని తొలగించేందుకు సిద్ధమైందనే వార్త ఆందోళనకు గురి చేస్తోందని చెప్పారు. అటు ప్రభుత్వాలు గానీ, బైజూస్ నిర్వాహకులు గానీ ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.