ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణాలోని పలు జిల్లాల్లో ఐపిఎస్ అధికారులతో పాటు కొందరు ఐఏఎస్ అధికారులను కూడా బదిలీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు, సూచనల మేరకు హైదరాబాద్ నగర కమిషనర్ గా సందీప్ శాండిల్యా, వరంగల్ కమిషనర్ గా అంబర్ కిషోర్ ఝా బాధ్యతలు చేపట్టారు.

నిజామాబాద్ సీపీగా కమలేశ్వర్ , సంగారెడ్డి జిల్లా ఎస్పీగా రూపేష్, కామారెడ్డి ఎస్పీగా సిందు శర్మ, నాగర్ కర్నూల్ ఎస్పీగా వైభవ్ గైక్వాడ్, సూర్యాపేట ఎస్పీగా రాహుల్ హెగ్డే, జగిత్యాల ఎస్పీ సంప్రీత్ సింగ్ , మహబూబ్ నగర్ ఎస్పీ హర్ష వర్ధన్, జోగులాంబ గద్వాల్ ఎస్పీగా రితి రాజ్, భూపాల్ పల్లి ఎస్పీగా కారే కిరణ్, నారాయణపెట్ ఎస్పీగా యోగేష్, మహబూబాబాద్ ఎస్పీగా పాటిల్ సింగ్ నియమితులైయ్యారు. ఐఏఎస్ అధికారుల విషయానికి వస్తే రంగారెడ్డి కలెక్టర్ గా భారతి హోలికేరీ, మేడ్చల్ మల్కాజ్ గిరీ కలెక్టర్ గా గౌతమ్ పొట్రు, యాదద్రి భోనగిరి కలెక్టర్ గా హన్మంతు కొండిబా, నిర్మల్ కలెక్టర్ ఆశిష్ సంగ్వన్ ను నియమించారు. అదేవిధంగా ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్, ఎండోమెంట్స్ స్పెషల్ సీఎస్ గా సునీల్ శర్మ, ఎక్సైజ్ కమిషనర్ గా జ్యోతిబుద్ధ ప్రకాష్, వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ గా క్రిస్టినా చొంగ్తు, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా వాణీప్రసాద్ లను నియమించారు.