ప్రతిష్టాత్మకమైన అదేవిధంగా వివాదాస్పదమైన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు అర్శనపల్లి జగన్మోహన్ రావు, అతడి ప్యానెల్ సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. ఉప్పల్ స్టేడియంలో నామినేషన్లు సమర్పించిన అనంతరం జగన్మోహన్ రావు తమ ప్యానెల్ పేరును ప్రకటించారు. యూనైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానెల్ నుంచి అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు, ఉపాధ్యక్షుడిగా పి.శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా ఆర్. హరినారాయణ, సహాయ కార్యదర్శిగా నోయల్ డేవిడ్ (మాజీ క్రికెటర్), కోశాధికారిగా సి.జె శ్రీనివాస్, కౌన్సిలర్‌గా అన్సర్ అహ్మద్ ఖాన్ పోటీ చేస్తున్నారు.