దేశంలో మొట్టమొదటి “ర్యాపిడ్ ఎక్స్” ప్రాంతీయ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 20వ తేదీన ప్రారంభిస్తారు. డిల్లీ, ఘజియాబాద్,మీరట్ ల మధ్య మొదట ఈ రైలు నడుపుతారు. పూర్తీ ఎయిర్ కండిషన్ బోగిలతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ రైలు గంటకు 16౦ కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.ప్రయాణికులు కూర్చోవడానికి,నిలబదదానికీ విశాలంగా ఉంటుంది. అంతేకాక,ప్రతీ బోగిలో సి.సి. కెమెరా అమర్చారు. లాప్ టాప్, మొబైల్ ఫోన్ లను చార్జింగ్ చేసుకునే సదుపాయం ఉంది.