బెట్టింగ్ రాజా సస్పెండ్…..

betting raja

డ్రీమ్ 11 బెట్టింగ్ లో 1.5 కోట్ల రూపాయలు గెలుచుకున్న మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఎస్సై సోమనాథ్ సస్పెండ్ అయ్యారు. ఆన్ లైన్ లో బెట్టింగ్ చేసిన ఎస్.ఐ. ఇంత పెద్ద మొత్తం గెలిచారనే వార్త బయటకు గుప్పుమనడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో అనుమతి లేకుండా బెట్టింగ్ కు పాల్పడడం, మీడియా ఎదుట పోలీస్ యూనిఫామ్ లో మాట్లాడటం వంటివి నిబంధనలకు విరుద్ధమని విచారణాధికారి పేర్కొన్నారు. దీంతో సోమనాథ్ పై చర్యలు తీసుకున్నట్లు పుణే పోలీసు ఉన్నతాధికారులు  తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *