తెలంగాణ డీజీపీ కార్యాలయంలో బతుకమ్మ ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. కార్యాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ బతుకమ్మ పండగకు డీజీపీ అంజనీ కుమార్,అడిషనల్ డీజీ సౌమ్య మిశ్రా, అభిలాష బిస్ట్, సంజయ్ కుమార్ జైన్, ఐ.జి రమేష్ రెడ్డి, ముఖ్య పరిపాలనాధికారి నవానీత తోసహా పలువురు పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఒక చోట చేర్చి ఉద్యోగులు, వారి పిల్లలు, చిన్నారులతో ఆటపాటలతో సంబరాలు చేసారు. దాండియా, బతుకమ్మ ఆటపాటల మధ్య జరిగిన ఈ బతుకమ్మ ఉత్సవాలలో ఉన్నతాధికారులు, ఉద్యోగుల సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ దేవి నవరాత్రి లతో మహిళలను శక్తి రూపంగా పూజించే గొప్ప సంస్కృతి మనలో ఉందని అన్నారు. పూలనే దేవుడిలా భావిస్తూ బతుకమ్మ ఉత్సవాలు జరపడం కేవలం మన రాష్ట్రంలోనే ఉందని పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అయన అభినందనలు తెలిపారు.
పోలీసుల బతుకమ్మ…
