Elections - EAGLE NEWS
reviw c

ఇక్కడ”దోపిడీ”-అక్కడ”అరాచకం”..!

తెలుగు రాష్ట్రాల ప్రజలు నిజంగా తెలివైన వారే అని ప్రపంచానికి చాటారు.మాటలు ముఖ్యం కాదు, చేతలు కావాలని తేల్చి చెప్పారు. గత ఏడాది తెలంగాణ ఎన్నికల్లో ఉద్యమ పార్టీని చిత్తుగా ఓడించారు. మొన్న ఆంద్రప్రదేశ్ ఎన్నికల్లో వైసిపిని నామరూపాలు లేకుండా చేశారు. తెలంగాణలో “కారు”ని షెడ్డుకి పంపితే, ఆంధ్రాలో “ఫ్యాన్”గాలి సోకకుండా అదుపు చేశారు. అదే తెలుగు ప్రజల రాజకీయ చైతన్యం. అయితే, తెలంగాణలో భారత రాష్ట్ర సమితి, ఆంధ్రా రాష్ట్రంలో వైసిపి కుదేలు కావడానికి ఒకటే…

Read More
bjp wrong cf

గుడిని కూల్చడం సాధ్యమా…?

నాలుగు వందల స్థానాలు గెలుస్తామని ఢంకా బజాయించి మరీ ప్రచారం చేస్తున్న భారతీయ జనతా పార్టీ అధినేతల మాటల్లో అవేశం కనిపించడం ఆశ్చర్య పరుస్తోంది. దేశంలో మూడో దశ పోలింగ్ పూర్తీ అయిన తర్వాత నరేంద్ర మోడీ, అమిత్ షా, ఆధిత్యనాథ్ లాంటి భాజాపా నేతల ప్రసంగాల్లో ఉహించని మార్పు కనిపిస్తోంది. ఈ నేతలు “ఇండియా కూటమి” పైనా, ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ మీద విసురుతున్న ఘాటైన విమర్శనాస్త్రాలు రాజకీయ పరిశీలకులను ఆలోచనల్లో పడేస్తున్నాయి….

Read More
viveka c

“వివేకా”హత్య..? సిబిఐకి “మచ్చ”..?

అంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించి, వివాదంగా మారిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య ఉదంతం చిలికి చిలికి గాలి వానగా మారుతోంది. అనేక పరిణామాలు, అనుమానాల మధ్య కేంద్ర నేర పరిశోధన సంస్థ (సిబిఐ) చేతికి వెళ్లిన ఈ సంఘటన విచారణ తీరు పై సైతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సిబిఐ ప్రతిష్ట పై మచ్చ పడే సూచనలు కనిపిస్తున్నాయి. వివేకానంద రెడ్డి హత్య వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే పక్కా పథకం…

Read More
IMG 20240421 WA0005

కక్షల పాలన…

సమర్థుడైన పాలకుడు ఉంటేనే ప్రజలకు సుపరిపాలన అందుతుంది, గత అయిదేళ్లుగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్న వారు మూడుముక్కలాటతో ప్రజల బతుకులను ఛిద్రం చేశారని నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రూరల్ బేతపూడి మల్లెతోటల్లో పనిచేస్తున్న మహిళా కూలీలను కలిసిన ఆమె వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ ఒకప్పుడు రాళ్లు రప్పలతో నిండిన హైదరాబాద్ ను హైటెక్ సిటీ నిర్మాణం ద్వారా విశ్వనగరంగా మార్చిన దార్శనికుడు చంద్రబాబునాయుడు అని, ఎల్లప్పుడూ…

Read More
IMG 20240414 WA0007

ఏం జరుగుతోంది..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి పై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. భద్రతా వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మొన్న ప్రధాని సభ, నిన్న సీఎం సభలో జరిగిన వరస ఘటనలపై విచారం వ్యక్తం చేసింది. తాజా ఘటనపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని విజయవాడ పోలీసులు జల్లెడ పడుతున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు…

Read More
brs natnl cc

మూలిగే “బిఆర్ఎస్”పై “మందు సీసా”…!

తెలంగాణా శాసనసభ ఎన్నికలకు ముందు కళ్ళాలు లేని గుర్రంలా పరుగులు తీసిన భారత రాష్ట్ర సమితి ఆ ఎన్నికల ఫలితాల అనంతరం సావడికే పరిమితమైంది. అధికారంలో ఉన్నప్పుడు అంతులేని ఆలోచనలతో రంకెలేసిన భారాస అధినేత, ఆయన అనుచరగణం ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పదేళ్ళ తిరుగులేని పాలనలో జరిగిన అవినీతి,అక్రమ వ్యవహారాలు ఒక్కసారిగా గుప్పుమనడం భారాస మనుగడకు తలనిప్పిగా మారడం ఒక సమస్య అయితే, ఏకంగా పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత…

Read More
brs natnl.jpg c

మూలిగే “బిఆర్ఎస్”పై “మందు సీసా”..!

భారత రాష్ట్ర సమితి జాతీయ ఎజెండా ఏమైంది? ఓటమి తర్వాత బిగుస్తున్న ఉచ్చులు పార్టీ మనుగడపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? ఇలాంటి అనేక అంశాల పై “ఈగల్ న్యూస్” ప్రత్యేక కథనం.. మీ కోసం…త్వరలో…

Read More
IMG 20240317 WA0086

మాకే మీ ఓటు…!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలని, దేశంలో ఈసారి 400 సీట్లు దాటాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆంధ్ర్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా బొప్పూడిలో టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. “నా ఆంధ్ర కుటుంబసభ్యులు అందరికీ నమస్కారం” అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని మోదీ ప్రారంభించారు. దేశంలో ఈసారి ఎన్డీఏకు 400 సీట్లు దాటాలని, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలని మోదీ అన్నారు. అభివృద్ధి చెందిన…

Read More
IMG 20240312 WA0020

మళ్ళీ”నమో”…

తెలంగాణ ప్రజల ఉత్సాహం చూస్తుంటే మోడీ మూడో సారి ప్రధాని కావడం ఖాయమనిపిస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భాజపా బూత్‌ స్థాయి అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మోడీని మూడో సారి ప్రధానిగా చేద్దామా..? 400 ఎంపీ సీట్లను ఆయనకు కానుకగా ఇద్దామా..? అంటూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు.”ప్రస్తుతం దేశంలో ఎక్కడికి వెళ్లినా మోడీ నామ స్మరణే వినిపిస్తోందన్నారు. మజ్లీస్‌…

Read More
chanakyam c

అంతుపట్టని”బాబు”చాణక్యం..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతోంది? ఒకప్పుడు జాతీయ రాజకీయాలను శాసించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాణక్యం ఎక్కడ దాచుకుంది? నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న”బాబు” కేవలం దశాబ్ద కాలంగా రాజకీయ తెరపై కనిపిస్తున్న అమిత్ షా కోసం ఎందుకు పడిగాపులు కాశారు? బాబు ఎన్.డి.ఏ. కన్వీనర్ గా  ఉన్నప్పుడు అసలు ఏం జరిగింది? ఆ పర్యవసానమే ప్రస్తుత ఫలితమా?  ఇలాంటి అనేక ప్రశ్నలకు ఆంధ్రా రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయి రాజకీయ…

Read More
24 c

24 అంటే 40-జనసేన “సినిమా” లెక్కలు…!

ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న శాసన సభ, లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి చేతులు కలిపిన తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఉత్కంఠకు తెరపడింది. రెండు పార్టీల మధ్య జరిగిన ఒప్పందంలో అక్కడున్న మొత్తం 175 నియోజక వర్గాలలో జనసేన కేవలం 24 స్థానాల్లోనే పోటీ చేయనుంది. అదేవిధంగా మూడు లోక్ సబ్ నియోజక వర్గాలలో “సేన” అభ్యర్ధులు బరిలోకి దిగుతారు. అయితే, ఇక్కడే “సైనికుల్లో” నిరాశ తలెత్తింది. అధికారమే లక్ష్యంగా, మార్పే…

Read More
IMG 20240214 WA0044

రాజ్యసభకు”రేణుక”

తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా, కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ లను ఎఐసిసి ప్రకటించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసి. వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు.

Read More
parlament

మళ్ళీ”హస్త”గతమే…

తెలంగాణలో అసెంబ్లీలో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల్లో కూడా మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టుడే “మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌” అభిప్రాయ సేకరణలో తేలింది. తెలంగాణ లోని 17 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ 10 సీట్లు గెలుచుకుంటుందని ఇండి యా టుడే తెలిపింది. కేసీఆర్‌ నేతృత్వం లోని బీఆర్‌ఎస్‌ కేవలం మూడు సీట్లే దక్కుతాయని, తెలంగాణలో ఎక్కువ సీట్లపై ఆశలు పెట్టుకున్న బీజేపీకీ 3 సీట్లే వస్తాయని, మజ్లి్‌స్ కు యథా ప్రకారం ఒక్క…

Read More