Boddinka C

“భాజపా”కి “బొద్దింకల” బెడద..!

కొత్తగా విడుదల అయ్యే సినిమాల్లో ఏది హిట్ కొడుతుందో, ఏది ఫట్ మంటుందో తెలియని పరిస్థితి. అనేక సార్లు భారీ బడ్జెట్, పేరున్న నటుల చిత్రాలు మార్కెట్ లో బోల్తా పడొచ్చు. కొన్ని చిన్న చిత్రాలు,  క్యారెక్టర్ ఆర్టిస్టుల సినిమాలకు జనం జేజేలు కొట్టవచ్చు. ఇవే వేదికలపై అవార్డులు , రివార్డులు  పొందవచ్చు. అంటే కథలో బలం ఉండాలి, కథనం ఆలోచింపజేసి, ఆసక్తి కలిగించేదిగా ఉండాలని అర్ధం. తెలుగులో “మెగా” ప్లాప్ లు , “పవర్” బోల్తా పడడం, బాలీవుడ్…

Read Full News
kasi finl

అంతుపట్టని ఆక్రోశం …!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణపై పీకల లోతు కోపంతో ఉన్నట్టు కనిపిస్తోంది. వ్యాపారం, సినిమాల కోసమే హైదరాబాద్ ని కేంద్రంగా చేసుకున్న సంగతి మరచిపోయి తెలంగాణ ప్రాంత అధికార పార్టీ పైన, ప్రభుత్వం పైనా, ఇతర పార్టీల నేతల పైన ఆయన నిప్పులు చెరుగుతున్నారు. మొన్నటి వరకు కెమెరాకు మాత్రమే పరిమితం అయి, సినిమా వేషాలు చూపించిన పవన్ ఆంధ్రలో చంద్రబాబు పంచన చేరి బిజెపి సిఫారసు మేరకు అక్కడ మంత్రి…

Read Full News
cover

అహం..పతనం.. అదే “సనాతనం”..!

అమ్ము కోవడం కోసం పార్టీలు పెట్టడం,పదవుల కోసం సిద్ధాంతాలు, లక్ష్యాలను తుంగలో  తొక్కడం  ఒకప్పటి ప్రజారాజ్యం, నేటి  జనసేన పార్టీలకే సొంతం. రంగు పూసుకున్న మొహాలు చూసే ప్రేక్షకులు తమను నాయకులుగా ఎన్నుకుంటారనే అత్యాశతో  రాజకీయ పార్టీలు పెట్టడం పారిపోయింది. తమిళనాడులో ఎంజీఆర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి అప్పటి పరిస్థితులే కారణం. అంతేకాదు, ఆ నాయకుల నిబద్ధత, ప్రజలకు సేవ చేయాలనే పట్టుదల కూడా వాళ్లను వెండితెర నుంచి జనంలోకి నడిపించాయి. పార్టీ సిద్ధాంతాలను వాళ్ళు ఎన్నడూ విస్మరించలేదు,…

Read Full News
Thumbnail

తప్పు చేశావ్ “దొరా”..!

అనుకున్నట్టే జరిగింది. చారిత్రక భాగ్యనరంలోని జూబ్లిహిల్స్ శాసనసభ నియోజక వర్గ ఉప ఎన్నికలలో తిరిగి కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది. దశాబ్ద కాలంగా ఈ ప్రాంతంలో రెపరెపలాడిన గులాబీ జెండా తలవంచింది. ఈ ఫలితంతో కారు షెడ్డుకి పోయి, దాని దొర ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యే సంకేతం జారీ అయినట్టు తేలిపోయింది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన భారత రాష్ట్ర సమితి, దాని అధినాయకత్వం, మందీ మార్భలం సతికిల పడ్డట్టు…

Read Full News
lovebirds c

“గులాబీ” పై “కాషాయం”మోజు..!

అయ్యో ఇదెక్కడి లొల్లి.. కెసిఆర్ బిడ్డ కవితక్క అలక బడితే తెలంగాణ సంగతేమో గానీ అటు దుబాయిలో బుర్జ్ ఖలీఫా బోసిబాయే… ఆస్ట్రేలియాలో “బతుకమ్మ” సతికిలబడే.. న్యూజిలాండ్ లోనూ గులాబీ “కివీస్” చిన్నబోయే…మొత్తంగా అక్క తిరిగిన అన్ని చోట్లూ అయోమయం… గందరగోళంగా మారిపోయే… పదేళ్లుగా అన్న, చెల్లెళ్ళు కలిసి సరదాలు, సంబురాలు చేసిన అమెరికా, ఐరోపా దేశాల్లో ఇదే వింత పరిస్థితి… ఉద్యమ పార్టీ కుటుంబంలో రాజుకున్న కలహాల వేడి ఇంత కాలం గులాబీ గుబాళించిన విశ్వం…

Read Full News
muslam c

“ముసలం” మొదలైందా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అంతర్గత ముసలం మొదలయిందా? ఎన్డీఏ కూటమిలోని పార్టీల మధ్య విభేదాల బీజం నాటుకుంటోందా? నేతల మధ్య బయటకు పొక్కని కుమ్ములాటలకు తెర లేచిందా? దక్షిణాదిలో ఆధిపత్యం కోసం ఆంధ్రా నేతలే పావులుగా బిజెపి చదరంగం సిద్ధం చేసిందా? జనసేన అధినేత వ్యవహార శైలిలో ఎందుకు మార్పు వచ్చింది? కీలకమైన మంత్రిత్వ శాఖను చేతిలో పెట్టుకున్న ఆయన రెండు మంత్రివర్గ సమావేశాలకు ఎందుకు హాజరు కాలేదు? అనారోగ్యంతో ఉన్న ఆయన్ని ముఖ్యమంత్రి పలకరించే ప్రయత్నం…

Read Full News
pawan pan c

కదులుతున్న బిజెపి “పావు”..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ “సనాతన ధర్మ పరిరక్షణ” పర్యటనకు ముహూర్తం ఖరారైంది. ఆయన ఈ నెల 12వ తేది నుంచి కేరళ, తమిళనాడులో సనాతన ధర్మ బాట పట్టనున్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో నాలుగు రోజులు పాటు వివిధ దేవాలయాలను సందర్శిస్తారు. మొదట కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వెళ్తారు. అక్కడి నుంచి తమిళనాడు లోని మధుర మీనాక్షి, శ్రీపరుశరామస్వామి, అగస్థ్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై…

Read Full News
CHIRU C

“అందరివాడు” క్లైమాక్స్ ఏమిటి..!

నటునిగా ఆయనకు తిరుగు లేదు. 70 ఏళ్ల వయస్సు మీద పడుతున్నా, పాత తరానికే కాదు, నేటి యువతరానికి కూడా ఆయన తెరపై కనిపిస్తే ఆ మజానే వేరు. సినిమా హిట్టు, ప్లాప్ లతో సంబంధం లేదు. ఆయన బొమ్మ, స్టెప్పులు మాత్రమే చాలు అంతే అదే లెక్క. . అయితే, తనకున్న అశేష ప్రేక్షక ఆదరణతో ఏదో ఆశించి, ఎంతో ఊహించి”చిరు”వేచిన తప్పటడుగు రాజకీయ తెరపై మాత్రం కోలుకోలేని “ప్లాప్” ని ఇచ్చింది. ఉదయించే సూర్యుడు…

Read Full News
IMG 20240818 WA0005

ఇక జాతీయ స్థాయి పోరు

జై స్వరాజ్ పార్టీ, జై హింద్ నేషనల్ పార్టీలు జాతీయ స్థాయిలో కలిసి పని చేయాలని నిర్ణయించాయి. జై స్వరాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు గౌడ, జై హింద్ నేషనల్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ మిశ్రా హైదరాబాద్ లోని హైటెక్స్ లో సమావేశమై దేశ సమకాలీన సమస్యలు, పేదరికం, అభివృద్ధి, ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల ఆలోచన విధానం తదితర అంశాలపై చర్చించారు. సమావేశ అనంతరం జై స్వరాజ్ పార్టీ అధినేత…

Read Full News
images 17

పార్టీలు పెంచిన “ప్రశాంత్”.!

ప్రశాంత్ కిషోర్… ఈ పేరు సామాన్య జనానికి అంతగా తెలియదేమో, కానీ, ఎన్నికల సంగ్రామంలో జరిగే రాజకీయ చదరంగంలో ఆయన ఒక వ్యూహకర్తగా పార్టీలకు, నాయకులకు సుపరిచితుడు. దశాబ్ద కాలం కిందట కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టడంలో కిషోర్ వ్యూహం కూడా కారణం అనే ప్రచారం ఉంది. అంతే కాదు,2012వ సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలో మోడీ మూడోసారి అధికారంలోకి రావడానికి కూడా ఆయనే ప్రధాన కారణం అనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో ఆయన దేశంలోని…

Read Full News
IMG 20240728 WA0002

కొత్త గవర్నర్ “వర్మ”

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ నియమితులయ్యారు.త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన ఆయన ప్రస్తుత ఇంచార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ స్థానంలో రానున్నారు. రాజ కుటుంబానికి చెందిన జిష్ణుదేవ్‌ 1957 ఆగస్టు 15న జన్మించారు.ఈయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు.1990ల ప్రారంభంలో బీజేపీలో చేరారు.అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నారు.2018-23 మధ్య ఉప ముఖ్యమంత్రిగా, త్రిపుర బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.కాగా తెలంగాణతో పాటు దేశంలోని ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్‌…

Read Full News
IMG 20240625 WA0007

మళ్ళీ”బిర్లా” ..

కేంద్రంలోని అధికార బీజేపీ నేతృత్వం లోని ఎన్డీయే, ప్రతిపక్షాల మధ్య స్పీకర్ ఎన్నికపై ఏకాభిప్రాయం కుదిరింది. దీంతో, మరోసారి ఆయన లోక్‌సభ స్పీకర్‌ పదవి చేపట్టనున్నారు. లోక్‌సభ స్పీకర్ పదవికి తమ అభ్యర్థిని నిలబెట్ట కూడదని విపక్షాలు నిర్ణయించుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాతో బిర్లా మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. కాసేపటిలో ఆయన స్పీకర్ పదవికి నామినేషన్ సమర్పించే అవకాశం ఉంది. అయితే, డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాల అభ్యర్థికి ఇవ్వాలని సభ్యులు రాహుల్…

Read Full News
amit suprim c

“సుప్రీమ్”ని ప్రశ్నించే ధైర్యమా…

ఎనిమిది, తొమ్మిదేళ్ళ కిందటి వరకు దేశ ప్రజలకు ఎవరో కూడా తెలియని వ్యక్తి ఈ రోజు న్యాయ వ్యవస్థను తప్పుపట్టే స్థాయికి చేరారు. ప్రజా స్వామ్య దేశం అందులోనూ పదేళ్లుగా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నామన్న ఒకే ఒక ధైర్యంతో అధికారం,  పార్టీ బలం చూసుకొని షా  అదుపు లేకుండా మాట్లాడడం విస్మయానికి గురి చేస్తోంది. కేంద్రంలో బాధ్యత గల పదవిలో అంటూ దేశ ప్రధానికి కుడి భుజంగా పేరున్న అమిత్ షా ఏకంగా సుప్రీం కోర్టు ఆదేశాలు,…

Read Full News
Trayam c

తెలంగాణాలో”విడి”- ఆంధ్రాలో”కలివిడి”..

తెలంగాణలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీల వైఖరి అంతుపట్ట కుండా ఉంది. అంధ్రప్రదేశ్ లో చేతులు కలిపిన ఆ మూడు పార్టీలు తెలంగాణాలో మాత్రం విడి పోయినట్టు కనిపిస్తోంది. తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో నానా హంగామా చేసిన జనసేన పార్టీ ఈ లోక్ సభ ఎన్నికల్లో పతా లేకుండా పోయింది. అప్పట్లో తెలుగుదేశంతో సన్నిహితంగా ఉంటూనే చంద్రబాబు నాయుడుకి మాట మాత్రం చెప్పకుండా ఏకపక్ష నిర్ణయంతో జనసేన ఎన్నికల…

Read Full News
IMG 20240317 WA0086

మాకే మీ ఓటు…!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలని, దేశంలో ఈసారి 400 సీట్లు దాటాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆంధ్ర్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా బొప్పూడిలో టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. “నా ఆంధ్ర కుటుంబసభ్యులు అందరికీ నమస్కారం” అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని మోదీ ప్రారంభించారు. దేశంలో ఈసారి ఎన్డీఏకు 400 సీట్లు దాటాలని, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలని మోదీ అన్నారు. అభివృద్ధి చెందిన…

Read Full News