నిజంగా చేస్తే పిల్లలు సూపర్…

egg

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మూడు రోజులు కోడిగుడ్డు, మరో మూడు రోజుల పాటు రాగిజావను అందించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఫోర్టిఫైడ్‌ రాగిజావను ఇందుకు వినియోగించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేన రాగిజావ పంపిణీపై డీఈవోలకు ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 20న రాగిజావ పంపిణీని ప్రారంభించనుండగా, జులై ఒకటి నుంచి రాష్ట్రంలోని 28,606 పాఠశాలల్లో పూర్తిస్థాయిలో అందజేయాలని వివరించారు. ఈ నెల 20న ఒక్కో జిల్లాల్లో 5వేల మంది విద్యార్థులకు రాగిజావను అందజేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *