నిజంగా “విక్రమర్కుడే”…!

batti people

క్రమశిక్షణకు మారు పేరు, పార్టీ పట్ల అంకితభావం, పార్టీ విధేయతకు, నీతికి నిజాయితీకి నిలువెత్తు రూపం మల్లు భట్టి విక్రమార్క.కష్టపడే మనస్తత్వం కలిగిన విక్రమార్క ఎన్ ఎస్ యు ఐ  కార్యకర్త నుంచి అంచలంచెలుగా కాంగ్రెస్ పార్టీలో ఎదిగారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కోసం ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మండుటెండలో పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో తనదైన పాత్రను పోషించారు. ఎమ్మెల్సీగా గెలుపొంది చీఫ్ విప్పుగా, డిప్యూటీ స్పీకర్ గా, సీఎల్పీ నేతగా సమర్థవంతమైన పరిపాలన అనుభవం ఉన్న భట్టి తెలంగాణ డిప్యూటీ సీఎంగా ఇచ్చిన బాధ్యతను అంగీకరించిన విధేయుడు. ఖమ్మం జిల్లా మధిర శాసనసభ నియోజకవర్గం నుంచి నాలుగోసారి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009, 2014, 2018, 2023 ఎన్నికలలో శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2007లో ఎమ్మెల్సీగా గెలుపొందారు.  విక్రమార్క 2009 నుండి 2011 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఉన్నారు. 2011 నుండి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు డిప్యూటీ స్పీకర్‌గా కూడా పనిచేశారు.

batti puja in

భట్టి సోదరులు దివంగత నేత మల్లు అనంత రాములుగారు కాంగ్రెస్ పార్టీలో చిరకాలం సేవలు అందించారు. ఆయన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షులుగా, ఎఐసిసి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.అనంత రాములు ఆకాంక్షలను కొనసాగిస్తూ భట్టి రాజకీయ అరంగ్రేటం చేశారు. గత నాలుగు దశాబ్దాలుగా పార్టీలో కార్యకర్త స్థాయి నుండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎదిగారు.రాష్ట్రంలో వైఎస్సార్ తర్వాత పాదయాత్ర చేసి ప్రజాదరణ పొందిన నాయకుడు భట్టి విక్రమార్క.  రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల గురించి అవగాహనతో పాటు రాష్ట్ర వనరుల పైన, రైతంగాం సమస్యల పైన, పీడిత అణగారిన వర్గాల స్థితిగతులు, భూ నిర్వాసితులు,  విద్యార్థులకు ఉపాధి అవకాశాల కల్పనలోనే కాకా, ఇతర అన్ని రంగాల పైన అపారమైన అనుభవం, తెలివి గల నాయకుడు అని చెప్పడంలో సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా ఆ పార్టీ విలువలకు కట్టుబడి క్రమశిక్షణ గల నాయకుడుగా నిలిచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అత్యంత కీలకంగా వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రజలకు భట్టిని మరింత దగ్గర చేసింది.  భట్టి డిప్యూటీ స్పీకర్ గా ఉన్నపుడే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లు పై శాసన సభ, శాసన మండలి లో సంతకం చేసి ఆమోద ముద్ర వేసిన ఘనత విక్రమార్కది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన సబ్ ప్లాన్ చట్టాన్ని తీసుకురావడంలో కీలక భూమిక పోషించారు. గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులను ఎత్తి చూపుతూ అసెంబ్లీ లో ప్రశ్నించడంతో పాటు వారి విధానాలకు వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసిన నాయకుడు. 2018 ఎన్నికలో కాంగ్రెస్ నుంచి 18 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మంది ఎమ్మెల్యేలు తెరాస పార్టీలో చేరినప్పుడు కష్ట కాలంలో పార్టీని కాపాడుకుంటూ కార్యకర్తలను, నాయకులను కాపాడుకుంటూ వచ్చిన నాయకుడు. కరోనా మొదటి వేవ్ లో ప్రాణాలను అర చేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఇంటి నుంచి బయటకు రాని వంటి పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ఈ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగైన వైద్యం అందించాలన్న సంకల్పంతో 2017లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించి కరోన రోగులను పరామర్శించి మనో స్థైర్యం కల్పించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో పాదయాత్ర దేశమంతా విజయవంతం అవ్వడంతో రాష్ట్రంలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మొదలు పెట్టి ఆదిలాబాద్ నుండి ఖమ్మం వరకు  అలుపెరగని బాటసారిగా 1365 కిలోమీటర్లు, 109 రోజులు పాదయాత్ర చేసి పార్టీ కార్యకర్తలో దైర్యం నింపడమే కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు భరోసా కల్పించే విధంగా తన పాదయాత్ర చేసి, రైతులను, మహిళలను, యువకులను, వృద్ధులను, యువకులను, పేద వారిని, అణగారిన, బలహీన, మైనార్టీ, వెనుకబడిన వర్గాల ప్రజలందరినీ కలిసి వారి కష్టాలను తెలుసుకొని వారికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి  వస్తే ఇందిరమ్మ రాజ్య స్థాపనలో సంక్షేమ పథకాలతో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది అని అన్ని వర్గాల ప్రజలకు వివరించి చెప్పి వారి ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ప్రజలకు భరోసా కల్పించి, దైర్యం చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *