సంక్షేమానికి కష్ట పడండి…

colecr cm

ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, తీసుకున్న నిర్ణయాలు అమలు జరగాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు  సేవకుల్లాగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. లక్ష్యం దిశగా ప్రయాణం చేయాలంటే కష్ట పడడం ఒక్కటే మార్గమన్నారు. ఇందులో భాగంగా బాధ్యత గల ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులు సైతం రోజుకు 18 గంటల పాటు పనిచేయాలని కోరారు. కలెక్టర్లు,  జిల్లా ఎస్పీలు,  పోలీస్ కమిషనర్లతో జరిగిన సమీక్ష సమావేశంలో రేవంత్ మాట్లాడారు. సచివాలయంలో ఏ నిర్ణయం జరిగినా దాన్ని  క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లు, పోలీస్ అధికారులదన్నారు.  పత్యక్షంగా ప్రజలతో సంబంధాలు వుండాల్సినవాళ్లు, వుండే వాళ్లు జిల్లా కలెక్టర్లు,  జిల్లా ఎస్పీలు,  పోలీస్ కమిషనర్లు అనీ  అందుకే ఈ రెండు ప్రజాపాలన మీద గ్రామ సభలు నిర్వహించి  నిజమైన లబ్దిదారులను గుర్తించి  నిస్సహాయులకు సహాయం అందించాలని సూచించారు.

colecr cmc 1

పౌరుల నైతికాభివృద్దే నిజమైన  దేశాభివృద్ది అని,   అద్దాల మేడలు, రంగుల గోడలు చూపించి అభివృద్ది జరిగిందనుకుంటే భ్రమ మాత్రమే అన్నారు.సమాజంలో  చివరి వరుసలో నిలబడ్డ  తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో   ఉండే ప్రతి పేదవాడికి  ప్రభుత్వం అందించదలుచుకున్న సంక్షేమ పథకం చేరాలన్నారు. ఈ అభయ హస్తం ద్వారా  అమలు చేయబోయో ఆరు గ్యారంటీలను, దానికి సంబంధించి వినతి పత్రాలను, అప్లికేషన్లను తీసుకోవాలన్నారు. అదేవిధంగా సివిల్ సర్వీసెస్ కు సంబంధించిన అఖిల భారత సర్వీసెస్  అధికారుల గురించి చర్చించాల్సి వచ్చినప్పుడు  మీరందరూ, మనమందరం ఎస్.ఆర్. శంకర్ ని గుర్తు చేసుకోవాలన్నారు. అయన  జీవితకాలం  సచివాలయానికి ఉదయం 9.30 గంటలకు నడుచుకుంటూ వచ్చి రాత్రి వరకు ఆయన దగ్గరకు వచ్చిన ప్రతీ  పైల్ ను క్షుణ్ణంగా పరిశీలించి,  విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వారని,  అతను అఖిల భారత సర్వీసెస్ అధికారులకు  ఒక ఆదర్శప్రాయమైన అధికారిగా  నిలబడడం గర్వించదగ్గ విషయం అని రేవంత్ కొనియాడారు.  కేంద్ర ప్రభుత్వం అయన సేవలను గుర్తించి  పద్మభూషణ్ అవార్డు ఇస్తే కూడా సున్నితంగా తిరస్కరించారని గుర్తు చేశారు. పరిపాలనలో  నిర్లక్ష్యం వహించినా లేదా ఉద్దేశపూర్వకంగా రకరకాల నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా ఈ ప్రభుత్వం వాటన్నింటిని కూడా సమీక్షించడం జరుగుతుందన్నారు. ప్రజల్లోకి వెళ్లేట్పప్పుడు, కలిసేటప్పుడు రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితులను ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోని వుండాన్నారు. బాధ్యతాయుతంగా  ప్రజలకు అందుబాటులో వుండి ప్రజల సమస్యల పరిష్కరించడంలో పేరు కుపోయిన సమస్యలను, ఆ చిక్కుముడులను విప్పడం ద్వారా  ప్రజలకు పరిపాలనను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ ప్రజాపాలన, ప్రజల సమస్యలు పరిష్కారం కోసం దిశగా ఈ నెల  28 నుంచి జనవరి 6,  2024 వరకు 8 పనిదినాలలో ఈ కార్యక్రమాలను నిర్వహించాలని,  దీనికి సంపూర్ణమైన సహకారం అందించే బాధ్యత  కలెక్టర్లదే అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే పౌరునితో వుండాలే గాని  క్రిమినల్స్ తో  కాదన్నారుగంజాయి, హెరాయిన్, కొకైన్ వాడే వాళ్లతో ఫ్రెండ్లీగాఉండడం ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదన్నారు. నేరాలు, హత్యలు చేసిన వాళ్లు పోలీస్ స్టేషన్ కు వస్తే వాళ్లను ఫ్రెండ్స్ లా ట్రీట్ చేయడం  ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదన్నారు.  సామాన్యమైన పౌరుడు పోలీస్ స్టేషన్ కు వస్తే ఫిర్యాదు చేయడానికి వస్తే  అతను ఏమి చెప్తున్నాడో, వాళ్లను కూర్చోబెట్టి మర్యాదగా వాళ్లను అడిగి తెలుసుకోవాల్సిన అవసరం వుందన్నారు. గతంలో తీవ్రవాదులను, ఐఎఎస్ఐ లాంటి వాళ్లను కూకటి వేళ్లతో పెకిలించడానికి, నిర్మూలించడానికి ఏ రకంగా అయితే కఠినమైన చర్యలు తీసుకున్నారో అదేవిధంగా  ఈ డ్రగ్ మహమ్మారినికి కూడా నిర్మూలించేందుకు కృషిచేయాలని పోలీసులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *