కలలు సాకారం చేస్తాం..

nurse c

నిరుద్యోగుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్ళుగా వారికి తీరని అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం కుటుంబంలో ఉద్యోగాలు నింపుకుంటూ విద్యావంతులైన నిరుద్యోగులను విస్మరించిందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కొత్తగా ఎంపికైన నర్సింగ్ ఆఫీసర్ (స్టాప్ నర్సు) లకు ఎల్.బి. స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందజేశారు. సంవత్సర కాలంగా వేచిసుస్తున్న అభ్యర్దులకు ఎలాగైనా న్యాయం చేయాలనే సంకల్పంతో నియమకాలను చేపట్టినట్టు,అందులో భాగంగానే నియామక పత్రాలు అందజేసినట్టు చెప్పారు.

nurse in

తెలంగాణ ప్రజల ఆశిస్సులతో పండుగ వాతారణం మధ్య గత డిసెంబర్ ఆరో తేదీన తాము ప్రమాణం చేసిన ఎల్.బి. స్టేడియంలోనే నిరుద్యోగులు సైతం ఆనందంగా ఉండాలనే కోరికతో తిరిగి ఇదే స్టేడియంలో ఉద్యోగ భర్తీలకు శ్రీకారం చుట్టినట్టు వివరించారు. 6956 మంది నర్సింగ్ ఆఫీసర్ కు నియామక పత్రాలు అందజేసినట్టు తెలిపారు. కొన్ని నెలల్లోనే రాష్ట్రంలో 15 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించి నిరుద్యోగుల కల నెరవేరుస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే సమాచారం సేకరిస్తున్నట్టు, అవసరం ఉన్న ప్రతీ చోట ఉద్యోగ నియామకాలు చేయనున్నట్టు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మంత్రులు దామోదర్ రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శాసనసభ్యులు మందుల శామ్యూల్ , నాగరాజు, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేణుగోపాల్, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా చోoగ్తు, కమిషనర్ కర్ణన్, తెలంగాణ నర్సింగ్ విభాగం డిప్యూటి డైరెక్టర్ విద్యుల్లత, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *