వీధికెక్కిన”రాజ”కుటుంబం..!

fmly c

“రాయలసీమ”…ఈ గడ్డ ఆది నుంచి కక్షలు, కార్పణ్యాలకు నిలువెత్తు నిదర్శం అని చరిత్ర చెబుతున్న పాఠం. అక్కడ రాజ్యం ఏలిన ఆనాటి రాజుల నుంచి నేడు రాజకీయంగా ఆధిపత్యం చెలాయిస్తున్న అనేక మంది నేతలలో ఆ నైజం స్పష్టంగా కనిపిస్తునే ఉంటోంది. తెలుగు రాష్ట్రాల్లో గొడ్డలి వేట్లు, నాటు బాంబులు, రాగి సంకటి అనగానే గుర్తొచ్చేది “సీమ” ప్రాంతాలే. ప్రత్యర్థులను వెతకడం, వేటాడడం,  ఎంత వాస్తవమో, కుటుంబ గౌరవానికి పెద్ద పీట వేయడం అంతే వాస్తవం. కానీ పరువు, మర్యాదల విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా వాళ్ళలో ఉన్న”కక్ష” నిద్ర లేవడం సహజంగా జరిగే తంతు.

jagan shamil 3

అదే కక్ష తీవ్ర రూపం దాల్చితే కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయి. ఏదో కారణంతో రేగే పగ ప్రేమలు,బంధాలను సైతం తెంచివేస్తాయి. ఒకరికొకరిని శత్రువులుగా మారుస్తాయి. దూరం చేస్తాయి. ఇలాంటి సంఘటనలు ఆ గడ్డ మీద గంజి సంకటి తాగే వారి నుంచి సంపన్న కుటుంబాల్లోనూ కోకొల్లలు దర్శనమిస్తాయి. అందుకే “సీమ పౌరుషం” అనే పదం అంతగా వాడుకలోకి వచ్చింది. అయితే, సుమారు రెండు దశాబ్దాలుగా  మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న చైతన్యం రాయలసీమ గడ్డను, అక్కడి బిడ్డలను సామరస్య పూర్వక వాతావరణం వైపు దృష్టి సారించేలా చేశాయి. అందుకే గత పదేళ్లుగా ఫ్యాక్షనిజం,”రక్త చరిత్ర”మరకలు క్రమంగా మసకబారుతున్నా యి. కానీ, ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే, అక్కడి వాసుల్లో పంతాలు, పట్టింపులూ నిగూఢంగా దాగి, ఏదో ఒక రోజు బయట పడతాయనే నానుడికి బలం చేకూర్చింనట్టుంది. దీనికి తాజా రాజకీయ పరిణామాలే నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తు న్నాయి. అంధ్రప్రదేశ్ లో కొద్ది నెలలుగా చోటుచేసుకుంటున్న సంఘటనలే సాక్ష్యంగా ఉన్నాయి. ఫ్యాక్షనిజం స్థానంలో రాజకీయ, కుటుంబ కక్షలకు తెరలేచినట్టు ప్రస్ఫుటం అవుతోంది. రాయలసీమ జిల్లాలకు చెందిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్టు, వై.ఎస్.షర్మిల, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిల కుటుంబ కలహాలు  జనం ముందు ఉదాహరణలుగా నిలిచాయి. చంద్రబాబు నాయుడు అరెస్టు,విడుదల రాజకీయ దుమారం లేపాయి. జగన్ “కక్ష” సాధింపు చర్యలో భాగమే బాబు అరెస్టు పర్వం అంటూ తెలుగుదేశం, దాని అనుబంధ సంస్థలు, భాగస్వామ్య పార్టీలు రోడ్డెక్కాయి. దీనిపై నేటికీ  తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

sharmil dharna

అయితే, పక్షం రోజులుగా బాబు – జగన్ ల వ్యవహారం కంటే “ఇంటి పోరు” రోడ్డు ఎక్కడం ప్రధాన చర్చలకు తెర లేపింది. ఉమ్మడి అంధ్రప్రదేశ్ జనంలో “జననేత”గా నిలిచి పోయిన స్వర్గీయ రాజశేఖరరెడ్డి సంతానమైన జగన్, షర్మిల మధ్య సాగుతున్న మాటల తూటాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కమిటీకి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన జగన్ సొంత చెల్లెలు షర్మిల ఇచ్ఛాపురం నుంచి అన్నయ్యపై బలమైన ఆరోపణలు చేయడం కీలక అంశంగా మారింది. జగన్ ప్రభుత్వంలోని అనేక రకాల అభివృద్ది లోపాలు, రాజకీయ కోణాలలోనే కాక కుటుంబ, వ్యాపార వ్యవహారాలను, వ్యక్తిగత వైషమ్యాలను సైతం షర్మిల ప్రజా క్షేత్రంలో ఎండగట్టడం రచ్చబండల పై వాడివేడి చర్చలకు దారి తీసింది.  ఇప్పటి వరకు ఆమె నిర్వహించిన ప్రతీ సమావేశంలోనూ ఆంధ్రాలోని తెలుగుదేశం, బిజెపిల పై కంటే వైసిపి, దాని కీలక నేతల పైనే విరుచుకు పడడం గమనార్హం. షర్మిల కొన్ని సందర్భాల్లో రాజకీయాన్ని పక్కన పెట్టి కేవలం కుటుంబ కలహాలనే ప్రధాన ఎజెండాగా తీసుకోవడం, దాన్ని వివరంగా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేయడం ఒక స్థాయిలో రాజకీయ పరిశీలకులను సైతం నివ్వెరపరచింది.

“సాక్షి” సంస్థలో నాకు భాగం ఉంది, అందులో రాజశేఖర్ రెడ్డి తనకు సగ భాగం వాటాగా ఇచ్చారనే విషయాన్ని వెల్లడించడంతో ఆమెలో జగన్ పై ఉన్న అక్కసు ఒక్కసారిగా బయట పడింది. జగన్ మూలంగానే తమ కుటుంబం ముక్కలైందనే రీతిలో షర్మిల చేస్తున్న ప్రసంగం, ప్రచారం సామాన్యులకు గానీ, రాజకీయాలకు సంబంధం లేకున్నా చర్చించుకునే అంశంగా మారాయి. జగన్ భారతీయ జనతా పార్టీ తో జతకట్టి రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు తిలోదకాలు ఇచ్చాడని దుయ్యబడుతూ కాంగ్రెస్ విసిరిన భాణం దూసుకుపోతోంది. బహుశా ఎన్నికల ప్రకటన వెలువడ లేదు కాబట్టి అనుకుంటా షర్మిల ఓట్లు అడగడం కంటే కూడా కుటుంబ విషయాలను, జగన్ వల్ల తనకు జరిగిన నష్టాన్ని ప్రజలకు చెబుతున్నట్టు కనిపిస్తోంది. మొన్న కడపలో జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ వైఎస్సార్ ఆశయాలను కొనసాగించ లేనీ మీరు వైఎస్సార్ వారసులు ఎలా అవుతారని జగన్ ని ప్రశ్నించారు.నాన్న రక్తమే నాలో ఉంది.పులి కడుపున పులే  పుడుతుందనీ, ఆంధ్ర రాష్ట్రం జగన్ కి ఎంతో నాకూ అంతే, ఇది నా పుట్టినిల్లు, ఇక్కడి ప్రజలకు సేవ చేయడానికే వచ్చానని చెబుతూ, నచ్చని వాళ్ళు “ఏం పీక్కుంటారో పీక్కోండి, ఎలాంటి నిందలు వేస్తారో వేయండి” అంటూ ముగించారు. ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న ఎన్నికల్లో ఫలితాల మాట దేవుడెరుగు గానీ ప్రచారం మాత్రం రసవత్తరంగా మారుతోందని ఆంధ్ర జనం పేర్కొంటున్నారు. అంతేకాక, జగన్, షర్మిల వ్యవహార శైలి చూస్తుంటే రాయలసీమ పౌరుషం ఇలా ఉంటుందా అని ఈ తరం వారూ చర్చించుకొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *