అధికారం లేక అసహనం…!

balka c

అధికారంలో ఉన్నప్పుడు “ఒంటెద్దు” పోకడలో పాలన చేసి, విపాక్ష పార్టీలు, వాటి నేతల పై అడ్డూఅదుపు లేకుండ మాట్లాడిన భారత రాష్ట్ర సమితి నేతల్లో ఇంకా ఆ బిరుసు తగ్గ లేదు. పదేళ్లుగా నియోజక వర్గాలను ఏకపక్షంగా ఏలిన బి.అర్.ఎస్. నేతలలో రెండు నెలలుగా ఏ అధికారం లేక అసహనం పెరిగిపోతోందనే బలమైన విమర్శలు వస్తున్నాయి. సుమారు 45 రోజులుగా ఆ పార్టీ క్రియాశీలక అధ్యక్షులు కెటిఆర్, ఎమ్మెల్సీ కవిత, కడియం శ్రీహరి వంటి నేతలు అధికార కాంగ్రెస్ పార్టీ, దాని నేతలపై అసందర్భంగా చేస్తున్న ఆరోపణలు, విమర్శలు, బెదిరింపు ధోరణుల పట్ల ఇప్పటికే వివిధ వర్గాల్లో బి.అర్.ఎస్. పై అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

శాసన సభలో పూర్తీ స్థాయి బలం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కలుస్తామని, ఆరు నెలల్లో కూలిపోతుందని గులాబీ నేతలు చేస్తున్న ప్రచారాతో బి.అర్.ఎస్. పై ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరిగిందని రాజకీయ పరిశీలకుల అంచనా. అంతేకాక, కొత్త ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనే ఏకైక ఎజెండాతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తున్న ఆరు గ్యారంటిల అమలుపై కెటిఆర్ వంటి నేతలు అనాలోచితంగా చేస్తున్న ప్రకటనలు, ప్రసంగాలు కూడా సమంజసం కాదని పలువురు పేర్కొంటున్నారు. ఇక అసెంబ్లీ అవరణలో పూలే విగ్రహం ఏర్పాటు మరో అంతుపట్టని డిమాండ్ గా తెరపైకి రావడం గులాబీ దండు ఎత్తుగడలకు నిలువెత్తు సాక్ష్యంగా ఉందని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యాని స్తున్నారు. గత పదేళ్లుగా తండ్రి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పూలే విగ్రహం పై పల్లెత్తు మాట ఎత్తని కవిత కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ అంశాన్ని లేవనెత్తడం రాజకీయ విశ్లేషకులకు కూడా అంతుపట్టడం లేదు. పదేళ్లుగా తమ చేతుల్లో ఉన్న విగ్రహం ఏర్పాటును విస్మరించి, అదేదో సామాన్య ప్రజా సమస్య అయినట్టు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేయడం పట్ల అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. కేసీఅర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని వారు ఎదురు దాడికి దిగుతున్నారు.

అధికారం కోల్పోయిన అగ్రనేతల వ్యవహారం ఇలా ఉంటే, అదే పార్టీకి చెందిన కింది స్థాయి నేతల “వేదన” మరోరకంగా కనిపిస్తోంది. ఉద్యమ నాయకులు పదేళ్లుగా ప్రజా ప్రతినిధులుగా మారిన సంగతి మరచిపోయినట్టు ప్రజా వేదికలపై రెచ్చి పోతున్నారు. బాధ్యత పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీపై, ఆ పార్టీ నేతల పైనా పచ్చి బూతు పదాలు ప్రయోగించడం, చెప్పులతో కొడతాం అంటూ పెట్రేగి పోవడం విస్మయం కలిగిస్తోంది. బి.అర్.ఎస్. మాజీ ఎం.ఎల్.ఎ. బాల్క సుమన్ మంచిర్యాలలో  ఓ వేదికపై విర్రవీగిన తీరు పట్ల అనేక మంది మండి పడుతున్నారు. ఏ కారణం లేకుండా అటు కాంగ్రెస్ ప్రభుత్వం పై నోటికొచ్చిన మాటలతో దుమ్మెత్తి పోయాడమే కాక, సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తవి చి మరీ ఆయన్ని చెప్పుతో కొడతా అంటూ తోటి భజనపరుల మధ్య సుమన్ వ్యవహరించిన తీరు ఆయనలోని అసహనానికి అద్దం పట్టిందని కాంగ్రెస్ నేతలు తేల్చి చెబుతున్నారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన అధికార పక్షం ఆయన పై ఫిర్యాదు చేయగా ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయడం గమనార్హం. ఆ పార్టీ అగ్రనేతల సూచనల మేరకే సుమన్ వ్యవహరించారని ఆరోపణలు వస్తున్నాయి. బి.అర్.ఎస్. నేతలు ప్రతిపక్షంగా చేయాల్సిన పనులను పక్కనపెట్టి ఉద్యమ నేతలుగా వ్యవహరిస్తున్నారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఉద్యమ సమయంలో లేవనెత్తిన అంశాలకు, ప్రత్యేక రాష్ట్రంలో ఆచరించాల్సిన విధానాలకు వ్యత్యాసం ఉంటుందనే విషయాన్ని బారాస ఆలోచిస్తే బాగుంటుందనే సూచనలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *