కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.భేటీ అనంతరం భట్టి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి మర్యాదపూర్వకంగా సోనియాతో సమావేశమయినట్టు, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరినట్టు చెప్పారు. అంశంపై రాష్ట్ర పార్టీ తీర్మానం చేసిన విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లామన్నారు. రాష్ట్రంలో అమలు చేసిన, చేయబోతున్న గ్యారంటీలను వివరించినట్టు ఆరు గ్యారంటిల్లో ఒకటైన మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలు తీరు, గడచిన రెండు నెలల్లో 15 కోట్ల జీరో టికెట్లు రికార్డు, త్వరలోనే మరో రెండు పథకాలను అమలు చేయబోతున్నట్లు, రాష్ట్రంలో మొదటిసారి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తున్నట్లు సోనియా దృష్టికి తీసుకెళ్లగా, అభినందించారని భట్టి వెల్లడించారు.