తెలంగాణ ఉద్యమ అంతిమ దశలో నాయకురాలిగా తెరపైకి తెచ్చిన కల్వకుంట్ల కవిత వాస్తవానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే వరకు ఎవరికీ తెలియదు. ఇది భారత రాష్ట్ర సమితి నేతలు అవునన్నా,కాదన్నా బహిరంగ రహస్యం. అలాంటి కవిత దశాబ్ద కాలంలో ఓడినా గెలిచే పదవులు, ఆలోచనలకు అందని ఆస్తులకు అధిపతి కావడం నిజంగా ఆశ్చర్యమే. ఆమె ప్రపంచ ప్రతిష్టకమైన దుబాయిలోని “బుర్జు కలిఫా”లో ఫ్లాట్ కొన్నప్పుడే తెలంగాణ ప్రజలకు ఆమె స్థాయి తెలిసి పోయింది. ఆ గృహ ప్రవేశాన్ని ఎంత అంగరంగ వైభవంగా చేసింది అందరికీ తెలిసిందే.సాధారణ ముఖ్యమంత్రి కూతురిగా కవిత సామాన్య జనం ఉహించని రీతిలోఎంతటి అక్రమాలకు పాల్పడిందనడానికి అరెస్ట్ మచ్చు తునక. తెలంగాణాలో ఏ అవసరం వచ్చినా మంత్రులు, ముఖ్యమంత్రితో సంబంధం లేదు ఒక్క “అమ్మాయి” అంతే. సమయం తీసుకోవాలి… నజరానా ఇవ్వాలి… అంతే పని అయిపోతుంది. అది ఎంతటి పనైనా…రూల్స్ లేకున్నా. ఇదీ మొన్నటి వరకు తెలంగాణాలో కవిత రాజ్యం. అంతెందుకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో పీకలలోతు ఇరుక్కున్న విషయం తెలిసి కూడా తనను ఇంట్లోనే విచారించాలని వితండ వాదం చేసిన ఘనత కూడా కవిత సొంతం. తెలంగాణ పోరాట పద్దతులు మత్రమే తెలిసిన భారాస నేతలు కవిత అరెస్టు వ్యవహారంలో దిక్కు తోచని స్థితిలో పడ్డారు. ఎన్నికల సమయంలో కవిత వ్యవహారాన్ని ఎలా కంపుపుచ్చాలో తెలియక భారాస అతలాకుతలం అవుతోంది.

పదేళ్లలో మంత్రిగా అనేక అనుభవాలు చూసిన కేటీఆర్ కూడా కవిత అరెస్టుని తప్పు పట్టడంలో రాజకీయ స్పష్టత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సాధారణంగా ఇలాంటి వ్యవహారాల్లో చట్టం,న్యాయం పై నమ్మకం ఉందనే ప్రకటనలు వినిపిస్తాయి. కానీ, కెటిఆర్, హరీష్ రావు మాటల్లో అవేవీ ప్రస్తావించక పోవడం గమనార్హం. ఆధారాలు లేకుండా కవితని అదుపులోకి తీసుకోలేదని, అరెస్టు చేయలేదని భారాస నేతలకు తెలియని విషయం కాదు. నిజంగా ఉద్యమ ఆలోచనల్లో ఉంటే కవితను శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్ళే లోపే భారాస విధ్వంసం చూపేది. బహుశా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందనే వాస్తవాన్ని గమనించారేమో. కేటీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ముందు ఆటలు సాగలేదు.అంతేకాదు, కవిత అరెస్టు పై పోరాడడానికి ఇది తెలంగాణ ఉద్యమం కాదని భారాస అధినేత సూచించినట్టు సమాచారం. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమార్జన చేసిన కవిత లావాదేవీలపై ఈడి పూర్తీ స్థాయి విచారణ చేపట్టనుంది.