erravlli ala c

చేరికలా… చొరబాటులా…?

తెలంగాణా ఉద్యమ పార్టీ భారత రాష్ట్ర సమితి (భారాస)లో ఏం జరుగుతోంది? ఆ పార్టీకి చెందిన నేతలు ఎందుకు గోడ దూకుతున్నారు?భారాస గొడుగు నీడ గిట్టడం లేదా లేక ఆ పార్టీ అధినేత ఇస్తున్న భరోసా పై నమ్మకం సన్నగిల్లిందా? కేసీఆర్ నమ్ముకున్న నేతలు పక్కా పార్టీల వైపు ఎందుకు ఎగబాకుతున్నారు? భారాస రాజకీయ వ్యూహంలో భాగంగా ఫిరాయింపులు జరుగుతున్నాయా?  లేక నేతలు ఎవరికి వారు సొంత నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుంటున్నారా? అసలు ఎర్రవల్లి…

Read More
IMG 20240315 WA0188

“కలిఫా” కవిత…!

తెలంగాణ ఉద్యమ అంతిమ దశలో నాయకురాలిగా తెరపైకి తెచ్చిన కల్వకుంట్ల కవిత వాస్తవానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే వరకు ఎవరికీ తెలియదు. ఇది భారత రాష్ట్ర సమితి నేతలు అవునన్నా,కాదన్నా బహిరంగ రహస్యం. అలాంటి కవిత దశాబ్ద కాలంలో ఓడినా గెలిచే పదవులు, ఆలోచనలకు అందని ఆస్తులకు అధిపతి కావడం నిజంగా ఆశ్చర్యమే. ఆమె ప్రపంచ ప్రతిష్టకమైన దుబాయిలోని “బుర్జు కలిఫా”లో ఫ్లాట్ కొన్నప్పుడే తెలంగాణ ప్రజలకు ఆమె స్థాయి తెలిసి పోయింది. ఆ గృహ…

Read More
IMG 20240315 WA0188

కవిత ఇంట్లో సోదాలు…

తెలంగాణలో మరో కుదుపు. భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఅర్ కుమార్తె, భారాస ఎం.ఎల్.సి. కల్వకుంట్ల కవిత ఇంట్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇ. డి.) సోదాలు చేయడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ సహా పలు చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు విచారణలో భాగంగా సుమారు 10 మంది అధికారుల బృందం సోదాలు చేపట్టినట్టు సమాచారం..

Read More
green c

“గులాబీ”లోనూ “పచ్చ”రక్తం …!

తెలంగాణ శాసన సభకు ఇటీవల జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన భారత రాష్ట్ర సమితి (భారాస) నేతల్లో అసహనం పరాకాష్టకు చేరుతున్నట్టు కనిపిస్తోంది. ఆవేశంలో యువ నేతలు గత చరిత్రను  మరచిపోతున్నట్టు స్పష్టం అవుతోంది. ప్రజల కోసమో లేక అధికారం లేదనే కోపమో తెలియదు గానీ కొద్ది రోజులుగా కెటిఆర్, కవిత, సుమన్, శ్రీహరి వంటి భారాస నేతలు కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యవహరిస్తున్న తీరు అంతుపట్టకుండా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారాస…

Read More
what is c

“ప్రొఫెసర్”ఉద్యమ నేత.. మరి”సంతోష్”..!

తెలంగాణలో బాధ్యత గల ప్రధాన ప్రతిపక్షం విధి ,విధానాలను విస్మరిస్తున్నట్టు కనిపిస్తోంది. పదేళ్ళ పాటు అధికారాన్ని చెలాయించిన భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) నేతలు మొన్నటి ఎన్నికల్లో అధికారం కోల్పోయినప్పటికీ ఇంకా అధికారంలోనే ఉన్నట్టు, తమ మాటలే సాగలన్నట్టు వ్యవహరించడం విడ్డూరంగా ఉంది. కొత్తగా అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంపై సుమారు నెల రోజులుగా బిఆర్ఎస్ నేతలు పొంతన లేని విమర్శలు, ఆరోపణలు చేయడం అంతుపట్టకుండా ఉందని రాజకీయ పరిశీలకులు, కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. అంతేకాక, ప్రభుత్వం…

Read More
kavita chai

ఛాయ్..బిస్కెట్…

శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లో పలు సమావేశాల్లో పాల్గొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టీ షాప్ వద్ద సందడి చేశారు. నిజామాబాద్ లోని గల సవేరా హోటల్ లో టీ తాగుతూ ఆమె అక్కడ ఉన్న జనాలతో కాసేపు ముచ్చటించారు. యువకులతో సెల్ఫీలు దిగారు.అకస్మాత్తుగా కవిత గారు తమ హోటల్ ను సందర్శించడం పట్ల యాజమాని, సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు.

Read More
ed kavit buchi

దూకుడు ఎందుకు…

దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు విచారణపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తిరిగి ఎందుకు వేగం పెంచిందనేది ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో చర్చననీయాంశంగా మారింది. రెండు రోజుల కిందట నిందితుడు బుచ్చిబాబుని ఈ.డి. విచారించడంతో ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో కథ ఎటువైపు తిరుగుతుందో అనే గుబులు పట్టుకుంది. ఈ.డి. ఒక్కసారిగా దూకుడు పెంచిందనే దానిపై అరా తీయడం మొదలైంది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ…

Read More

అసమ్మతి సెగలు…

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారత్ రాష్ట్ర సమితిలో (బి ఆర్ ఎస్)లో అసమ్మతి రాజుకుంటోందా? సిట్టింగ్ ఎమ్మెల్యేలు, గత ఎన్నికలలో టికెట్ ఆశించి భంగపడ్డ వారు తమ మనుగడ కోసం అధినాయత్వాన్ని సైతం లెక్కచేయకుండా భరిలోకి దిగవచ్చా? ఈ రెండు ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికలకు నాలుగు నెలాల ముందే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో బి ఆర్ ఎస్ లో వర్గ పోరు గుప్పుమనడ అసమ్మతికి సంకేతంగా రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. దాదాపు అన్ని…

Read More