ఢిల్లీ మద్యం విక్రయ లావాదేవీల కుంభకోణంలో చిక్కుకున్న తెలంగాణా ముద్దు బిడ్డ కల్వకుంట్ల కవిత చివరి వరకు ఎన్ని సాకులు చెప్పినా తిహర్ జైలు ఊసల వెనక్కి వెళ్ళక తప్పలేదు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరెట్ అధికారుల కస్టడీ అనంతరం ఆమె చేసిన అర్థరహింత విజ్ఞప్తిని కోర్టు త్రోసిపుచ్చింది. తన కుమారుని పరీక్షలు ఉన్నాయంటూ ఆమె చేసిన విజ్ఞప్తిని కోర్టు సాకుగా పరిగణించింది. అందుకే, కవితకు వచ్చే నెల 9 వ తేదీ వరకు జ్యూడిషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశించింది.దీంతో ఆమెను తీహార్ జైలుకు తరలించారు.