లోక్ సభ వద్దు.. అసెంబ్లీ ముద్దు…!

no loksabha copy

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కల్వకుంట్ల, తన్నీరు కుటుంబాల నుంచి ఏ ఒక్కరూ పోటీ చేయడం లేదు. రెండు దశాబ్దాల పార్టీ చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం ఇదే తొలిసారి. గత శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓడి పోవడంతో భారాస నేతలు, కార్యకర్తల్లో తీవ్ర  నిరాశ నెలకొంది. కనీసం పోటీ చేయడానికి సిట్టింగ్ ఎంపీలు కూడా ముందుకు రావడం లేరు. అయితే, ఉద్యమ పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపడానికి ఆ కుటుంబం నుంచి ఎవరైనా బరిలోకి దిగితే  బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా అధినేత మాత్రం పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంన్నట్టు ఆ పార్టీ వర్గాల ద్వారానే వెల్లడవుతోంది. తెలంగాణా సాధన కోసం టీఆర్ఎస్ పేరుతో పార్టీని స్థాపించిన తర్వాత 2004 లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి కేసీఆర్ పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేసి కేసిఆర్ విజయం సాధించారు. ఆయన ఇక్కడి నుంచి ఎంపీగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ ప్రతేక తెలంగాణా ప్రకటించింది. అనంతరం 2014 ఎన్నికల్లో గజ్వేల్ నుంచి శాసనసభకు, మెదక్ నుంచి లోక్ సభకు పోటీ చేసి రెండు చోట్లా గెలిచారు. మెదక్ ఎంపీ స్థానానికి రాజీనామా చేసిన కేసీఅర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఆ ఎన్నికల్లోనే కవిత నిజామాబాద్ స్థానం నుంచి పోటీ విజయం సాధించారు.

kavitha court

కానీ, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేసి పరాజయం చవి చూశారు. మళ్ళీ ఈ సారి నిజామాబాద్ స్థానం నుంచి కవితకు అవకాశం లభిస్తుందన్న వార్తలు వెలువడ్డాయి. మద్యం కుంభకోణంలో కవిత అరెస్టు కావడంతో ఆ వ్యూహం కాస్తా బెడిసి కొట్టింది. ఆ స్థానంలో బాజిరెడ్డి గోవర్ధన్ ని రంగంలోకి దించారు. ఒక సందర్భంలో మల్కాజిగిరి నుంచి కేటీఆర్ పోటీ చేస్తారనే వార్తలు గుప్పుమన్నాయి. కానీ అక్కడ  లక్ష్మారెడ్డికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా మెదక్ నుంచి కేసీఆర్, కవిత, హరీశ్‌ రావు పోటీ చేస్తారని విస్తృత ప్రచారం జరిగింది. కానీ, అక్కడ వెంకట్రామి రెడ్డిని ప్రకటించారు. దీంతో ఈ లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం పోటీ చేయడం లేదని స్పష్టం అవుతోంది. మరో వైపు  రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేసీఆర్ సమీప బంధువు జోగినపల్లి సంతోష్ పదవీ కాలం కూడా వచ్చే నెల 2న ముగుస్తుంది దీంతో, పార్లమెంటు ఉభయ సభల్లో కేసీఆర్  బంధువులు లేకుండా పోతుంది. ఇదే జరిగితే 20 ఏళ్లలో ఉభయ సభల్లో కేసీఆర్ కుటుంబం నుంచి ప్రాతినిథ్యం లేకపోవడం ఇదే మొదటి సారి అవుతుంది. ఈ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్‌ రావు, సంతోష్‌ రావు తదితరులు పార్లమెంటుకు దూరంగా ఉంటున్న సంకేతాలు చర్చనీయాంశంగా మారింది. లోక్ సభ ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే  శాసన సభలో కూడా ప్రాతినిథ్యం లేకుండా పోతుందనే ఆలోచనలతో అధినేత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *