కుదిపిన భూకంపం…

IMG 20240403 WA0010

తైవాన్‌లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున తైవాన్‌ రాజధాని తైపీలో రిక్టర్‌ స్కేల్‌ పై 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. తైవాన్‌లో హువాలియన్‌ సిటీకి దక్షిణంగా 18 కిలో మీటర్ల దూరంలో 34.8 కిలో మిటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు. ఆస్తీ, ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియ రాలేదు. భూకంప తీవ్రతకు ఓ బిల్డింగ్ ప్రమాదకర స్థాయిలో కుంగిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మియాకోజిమా ద్వీపంతో సహా జపాన్‌ దీవులకు సుమారు మూడు మీటర్ల ఎత్తులో సముద్ర అలలు ఎగిసిపడి సునామి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో, తైవాన్‌ ప్రజలు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. పెద్ద సంఖ్యలో​ జనాలు రోడ్ల పైకి వచ్చారు. ఇదిలాఉంటే, సునామి రాబోతోంది , అందరూ ఖాళీ చేయండని అక్కడి టీవీ ఛానెల్స్‌ ప్రసారం చేస్తున్నాయి. జపాన్‌ సైతం సునామి హెచ్చరికలు జారీ చేసింది. 1999లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 2400 మంది తైవాన్‌ ప్రజలు మృత్యువాత పడ్డారు. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సారి ప్రాణ నష్టం జరగకుండా అధికార యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *