లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ తుక్కుగూడలో నిర్వహించిన “కాంగ్రెస్ జన జాతర’ సభలో ఆయన ప్రసంగించారు. “కేసీఆర్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడినా చూస్తూ ఊరుకుంటానని ఆయన అనుకుంటున్నారు. అలా ఊరుకోవడానికి నేను జానారెడ్డిని కాదనీ, రేవంత్ రెడ్డిననీ, ఎలాబడితే అలా మాట్లాడితే కేసీఆర్ ను జైలులో పెడతామని హెచ్చరించారు. ఆయనకు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తాం” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
జైల్ లో “ఇల్లు” కట్టిస్తా..
