అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘాలలో ఒకటైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) 2024- 26 సంవత్సరానికి గానూ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించింది. చికాగో విభాగంలో చురుకైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న మదన్ పాములపాటికి నాట్స్ బోర్డు అధ్యక్ష బాధ్యతలు కట్ట బెట్టింది. అయాన గతంలో చికాగో చాప్టర్ లో జరిగిన ఎన్నో సేవా కార్యక్రమాలలో కీలక పాత్ర పోషించారు. రెండు సార్లు నాట్స్ కోశాధికారి, సంబరాల కమిటీ సెక్రటరీ, నాట్స్ వైస్ ప్రెసిడెంట్ (సర్వీసెస్) ఇలా ఎన్నో బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు. దీంతో, నాట్స్ అధ్యక్ష పదవికి మదన్ పాములపాటి వైపే నాట్స్ బోర్డ్ మొగ్గు చూపింది.