ముంచిన “కుటుంబ కథా చిత్రం”..!

katha c

జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీకి ఆంద్రప్రదేశ్ లో ఈ సారి కొత్త తరహా దెబ్బ తగిలింది. వివిధ రాష్ట్రాల్లో ఆ పార్టీ గెలవడానికి, ఓడిపోవడానికి అక్కడి రాజకీయ సమీకరణలు కారణమైతే, ఆంధ్రాలో మాత్రం కేవలం కుటుంబ కలహాలు పార్టీ ఆశలను బూడిదలో పోశాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వానికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుతో ప్రతికూల వాతావరణం ఏర్పడిందని, దాన్ని అవకాశంగా మలచుకొని లబ్ధి పొందవచ్చనుకొని  కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం పావులు కదిపింది. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి మరణంతో ఆంద్రప్రదేశ్ లో కనుమరుగైన కాంగ్రెస్ పార్టీ, దాని నేతలకు తిరిగి జవసత్వాలు పోయాలని రాహూల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, వేణుగోపాల్ వంటి నేతలు వ్యూహాలకు పదును పెట్టారు. సమర్ధులైన వారికి ఆంధ్ర పీసీసీ పగ్గాలు అప్పజెప్పాలని నిర్ణయానికి వచ్చాయి.

reviw in 1 1

అధికార వైసిపి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలను ఎదుర్కోగలిగిన వారి కోసం వెతుకులాడింది. ఈ క్రమంలో తెలంగాణ శాసనసభ ఎన్నికల పోటీ బరి నుంచి జండా పికేసిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల వైపు అధిష్టానం దృష్టి సారించింది. తెలంగాణ ఎన్నికల నుంచి వైదొలుగుతున్నట్టు అప్పట్లో హైదరాబాద్ లోనే షర్మిల ప్రకటించారు. షర్మిల వైఎస్ఆర్ కూతురు కావడం వల్ల కలిసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ భావించింది. అంతేకాక సొంత అన్నయ్య జగన్ మోహన్ రెడ్డి పై పీకల దాకా కసితో తగిలిపోతున్న ఆమెనే ఏఐసీసీ పావుగా ఎంచుకుంది. ఆంధ్రప్రదేశ్ లో అనేక మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు ఉన్నప్పటికీ వాళ్ళను పక్కకు నెట్టి రాత్రికి రాత్రే షర్మిలను ఏపీసీసీ అధ్యక్షురాలుగా రాజకీయ తెరపైకి తెచ్చారు. కానీ,ఆమె ప్రచార అమ్ముల పొదిలో ఎలాంటి అస్త్రాలు ఉన్నాయనే విషయాన్ని కాంగ్రెస్ అగ్రనాయకత్వం సహా  కె.సి. వేణుగోపాల్ వంటి పరిశీలకులు సైతం అంచనా వేయలేదు.

sharml dhrna

ఎన్నికల సభల్లో ఆమె ప్రజా సమస్యలను పక్కనపెట్టి తమ కుటుంబంలో నాలుగు గోడల మధ్య జరిగిన భాగోతాన్ని రచ్చకిడ్చారు. కేవలం జగన్ నే లక్ష్యంగా చేసుకొని ప్రతీ వేదికపై ఒక్కో రోజు ఒక్కో తరహా కుటుంబ వ్యవహారాన్ని షర్మిల పద్ధతిగా జనం మధ్యకు తీసుకువెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ లోని ఐదు కోట్ల మంది ప్రజలు మా గోడు వినాలి గానీ మీ “కుటుంబ కథా చిత్రం” మనేందుకు అని విసురుకునే స్థాయిలో  షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రచారం సాగింది. ఆంధ్రప్రదేశ్ తో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డికి ఉన్న అనుబంధం, వివిధ జిల్లా నేతలతో ఆయన మమేకమైన తీరుతెన్నులు, వైఎస్ హయంలో జరిగిన అభివృద్ధి పనుల వంటి అంశాలను ప్రధాన ఎజెండాగా చేసుకొని ప్రచారం చేస్తే బాగుండేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇవ్వన్నీ పక్కన పెట్టి ఒక్క జగన్ నే దోషిగా ఎత్తి చూపడంలో షర్మిల కొంతమేర సఫలం అయ్యారు గానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఆశించిన ఫలితం దక్కలేదని కళ్ళకు కనిపిస్తున్న వాస్తవం.

sunkara

కుమ్ములాటలు..

katha in copy

ఇదిలా ఉంటే, ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో అంతర్గత కుమ్ములాటలు రోడ్డున పడ్డాయి. అన్ని విభాగాలను రద్దు చేసినట్టు షర్మిల ప్రకటించడంతో కొందరు నేతలు ఆమె పై భగ్గుమంటున్నారు. ఆయా కమిటీల పదవులు అమ్ముకోవడానికి షర్మిల ఒంటెత్తు పోకడలు అవలంభిస్తోందని సుంకర పద్మ శ్రీ, రాకేష్ రెడ్డి వంటి నేతలు మండి పడుతున్నారు. ఏఐసీసీ చేయాల్సిన పనులను, పీసీసీ చేయడం ఏమిటని నిలదీస్తున్నారు. ఈ మేరకు కొందరు హై కమాండ్ కి ఫిర్యాదు చేస్తున్నారు. ఎన్నికల్లో పార్టీకి జరిగిన నష్టాన్ని, సీట్ల కేటాయింపులో లొసుగులను ఢిల్లీ పెద్దలతో చెప్పి అక్కడే తేల్చుకుంటామని కొందరు తేల్చి చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *