ముంచిన “కుటుంబ కథా చిత్రం”..!
జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీకి ఆంద్రప్రదేశ్ లో ఈ సారి కొత్త తరహా దెబ్బ తగిలింది. వివిధ రాష్ట్రాల్లో ఆ పార్టీ గెలవడానికి, ఓడిపోవడానికి అక్కడి రాజకీయ సమీకరణలు కారణమైతే, ఆంధ్రాలో మాత్రం కేవలం కుటుంబ కలహాలు పార్టీ ఆశలను బూడిదలో పోశాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వానికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుతో ప్రతికూల వాతావరణం ఏర్పడిందని, దాన్ని అవకాశంగా మలచుకొని లబ్ధి పొందవచ్చనుకొని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం పావులు…