ప్రపంచానికి “నాసా” తాజా వార్త వెల్లడించింది. రానున్న 14 ఏళ్లలో ఓ ఆస్టరాయిడ్ భూమిని ఢీ కొట్టే ప్రమాదం ఉందని అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) నివేదికలో పేర్కొంది. 2038 జులై 12న గ్రహ శకలం భూమిని ఢీ కొట్టేందుకు 72 శాతం అవకాశాలున్నాయని స్పష్టం చేసింది. మేరీ ల్యాండ్ లోని జాన్స్ హాప్కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ లాబొరేటరీ చేసిన పరిశోధనల్లో ఈ విషయం బయట పడిందని వివరించింది. అయితే అప్పటి వరకు జరిగే మరిన్ని అధ్యయనాల ద్వారా దాని దిశ ఎలా మార్చాలన్న దానిపై కృషి చేస్తామని తెలిపింది.