ఫ్లోరిడా విమానాశ్రయంలో అమెరికన్ ఎయిర్ లైన్స్ 590 విమానం టేకాఫ్ అవుతోన్న సమయంలో టైర్లు ఒక్కసారిగా పేలిపోయి, పొగలు వచ్చాయి.పైలట్లు అప్రమత్తమై బ్రేకులు వేయడంతో ఫ్లైట్ రన్ వే చివర ఆగింది. ఒక వేళ పైలట్లు గమనించకుండా టేకాఫ్ చేసి ఉంటే భారీ ప్రమాదం జరిగి 176 మంది ప్రాణాలు ప్రమాదంలో పడేవి అని పైలట్లను అభినందించారు.