పాదయాత్రలో ఉన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఇంఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే,, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి కలిశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా పాదయాత్ర శిబిరం వద్దకు వచ్చిన వారు ఆయనతో సుధీర్ఘ చర్చలు జరిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, చేరికలపైనా సుదీర్ఘ చర్చించినట్టు తెలుస్తోంది. సుమారు గంటన్నర పైగా ఏకాంతంగా చర్చలు ముగ్గురు నాయకులు చర్చలు జరపడం గమనార్హం. భట్టి విక్రమార్కతో హైకమాండ్ నేతలు కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనియాంశంగా మారింది.