పచ్చని రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలోని పలు ప్రాంతాలో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ ఘటనలో చిన్నారులు సహా 90 మందికి పైగా మరణించినట్టు తెలుస్తుంది, వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. వారిని కాపాడేందుకు ఘటనా స్థలంలో రెస్య్కూ టీమ్ సహాయక చర్యలు చేపట్టి నట్లు అధికారులు తెలిపారు. మెప్పాడి ముండకై ప్రాంతం లో అర్థరాత్రి ఒంటి గంటకు, ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు రెండుసార్లు కొండచరియలు విరిగి పడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే కేరళ రాష్ట్ర విపత్త నిర్వహణ దళం, ఫైరింజన్లు స్పందించి ఘటనాస్థలానికి చేరుకున్నాయి. సమీపంలోని ప్రాంతాల నుంచి అదనపు రెస్య్కూ టీమ్ సైతం వయనాడ్ కు చేరుకుంటున్నట్లు అధి కారులు చెబుతున్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం వాటిల్లు తోంది. అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. భారీ వర్షాల కారణంగా వరదల్లో అనేక మంది కొట్టుకుపోయినట్టు సమాచారం అందుతోంది.