పారి పోయిన ప్రధాని..

IMG 20240805 WA0040

బంగ్లాదేశ్ లో తీవ్ర రూపం దాల్చిన రిజర్వేషన్ల వ్యతిరేక పోరాటంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేశారు. ఆమె దేశం విడిచి వెళ్ళిపోయినట్టు సమాచారం అందుతోంది. మిలటరీ హెలీ కాప్టర్ లో హసీనా సోదరితో కలసి భారత్ లో ఆశ్రయం పొందుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే సందర్భంలో ఆమె లండన్ వైపు పయనమైనట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ విముక్త పోరాట వీరుల కుటుంబ సభ్యులకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ అక్కడి విద్యార్థులు సాగిస్తున్న పోరాటం తీవ్ర రూపం దాల్చింది. దీంతో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి.

Screenshot 20240805 164151 WhatsApp

ఆందోళనకారులు రాజధాని ఢాకాలోని ప్రధానమంత్రి నివాస భవనాన్ని ముట్టడించారు. దాంతో ప్రధాని షేక్ హసీనా తన సోదరితో కలిసి ‘గాన భవన్’ ప్యాలెస్ ను వీడి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు. అందుకోసం ప్రత్యేక హెలికాప్టర్ ను ఉపయోగించినట్టు తెలుస్తోంది. అనంతరం ఆమె రాజీనామా చేశారు.నిన్న జరిగిన హింసలో 98 మంది మరణించగా, దేశంలోని అనేక ప్రాంతాలకు ఘర్షణలు ఎగ పాకాయి. ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా దిగిపోవాలంటూ నిరసనకారులు రోడ్లెక్కారు. అధికారిక నివాసాన్ని వీడేముందు ప్రధాని షేక్ హసీనా ఓ సందేశాన్ని రికార్డు చేయాలని భావించినా, ఆందోళనకారుల ముట్టడితో అది సాధ్యం కాలేదు.

images 16

కర్ఫ్యూ విధించినప్పటికీ లెక్కచేయకుండా ఇవాళ వేలామంది నిరసనకారులు ఢాకా వీధుల్లో కవాతు చేస్తూ ప్రధాని నివాసాన్ని ముట్టడించారు. సైన్యం, పోలీసులు బారికేడ్లు, ముళ్లకంచెలు అడ్డుగా పెట్టినప్పటికీ, భారీ సంఖ్యలో తరలివచ్చిన నిరసనకారులు వాటిని తొలగించుకుని ముందుకు పోయారు. తాజా పరిణామాల నేపథ్యంలో, బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకీర్ ఉజ్ జమాన్ దేశాన్ని ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. హసీనా దేశం వీడి పోవడంతో అధికారాన్ని ఆ దేశ ఆర్మీ చేతుల్లోకి తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *