అడవి బిడ్డలకు అండగా…

IMG 20240809 WA0018

ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం నిర్వహిస్తారు. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించాలని 1994లో ఐక్య రాజ్య సమితి ప్రకటించింది. 1982, ఆగస్టు 9న జెనివాలో అటవి వనరుల హక్కులకు సంబంధించిన సమస్యలపై 26 మంది స్వతంత్ర మానవ హక్కుల మేధావులతో వర్కింగ్‌ గ్రూప్‌ల సమావేశాన్ని జరిగింది. ఈ సమావేశంలో 140 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆదివాసీల కోసం కూడా ఒక రోజు ఉండాలని ఐక్య రాజ్య సమితిని కమిటీ కోరగా, ఆదివాసుల సంరక్షణ చట్టాలకు ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపింది. ఈ కమిటీ 1992 నుండి పది సంవత్సరాల పాటు ప్రపంచ వ్యాప్తంగా తిరిగి ఆదివాసీల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి విశ్లేషించి 1994 నుండి 2014 వరకు ఆ మధ్య కాలాన్ని ఆదివాసీల అభివృద్ధి కాలంగా పరిగణించి ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవంగా ప్రకటించింది.

IMG 20240809 WA0017

ప్రపంచ వ్యాప్తంగా 90 దేశాల్లో 50 కోట్ల మంది దాకా ఆదివాసీలు ఉన్నారు. ప్రపంచ జనాభాలో వారు 5% లోపే కానీ, వారు ఏడు వేల భాషలు మాట్లాడుతారు. 5 వేల విభిన్న సంస్కృతులను ఆచరిస్తున్నారు. వారి జీవన విధానం పర్యావరణ హితంగా ఉంటుంది. ప్రపంచీకరణ ప్రభావం వారి సంస్కృతిని దెబ్బ తీస్తోంది. ఈ క్రమంలో ఆదీవాసీల సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్య సమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ఏటా ఆగష్ట్ 9న అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవాన్ని నిర్వహిస్తుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *