babu mark c

ఎవరి “మార్కు” పాలన..!

ఆంద్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కొత్త ప్రభుత్వ పాలన అందరినీ ఆకర్షిస్తోంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. చంద్రబాబు  పరిపాలన ఆలోచనలు, రూపొందించే వ్యూహాలు ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తాయనేది తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిన విషయమే. నెల రోజుల పాలనలో రాష్ట్ర అభివృద్ది కోసం ఆయన పడుతున్న ఆరాటం ప్రతీ ఒక్కరూ చూస్తూనే ఉన్నారు. అమరావతి అభివృద్ది, విశాఖ ఉక్కు కర్మాగారం వ్యవహారం, భోగాపురం విమానాశ్రయ నిర్మాణం, రైతు సమస్యల పై…

Read More
babu revnt 6

దశాబ్దం కాలంలో తొలి అడుగు…

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలు, ఇతర సమస్యల పరిష్కారంపై హైదరాబాద్‌లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు నడిశాయి. గత  పదేళ్లలో ఏ వివాదాలూ లేకుండా రెండు రాష్ట్రాలకు సంబంధించిన అత్యంత కీలకాంశాల పరిష్కారం దిశగా జరిగిన మొదటి సమావేశం ఇదే కావడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేసే వివిధ జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను పరస్పర సహకారంతో వేగంగా పూర్తిచేసుకోవాలని సమావేశంలో…

Read More
ramojir c

అకాడమీకి “రామోజీ” పేరెందుకు..!

రామోజీ రావు ఒక పత్రికకు అధిపతి. “ఈనాడు” పేరుతో ఆయన చేసింది సమాజ సేవ కాదు, అది ఒక వ్యాపారం. ఇది తెలుగు రాష్ట్రాల్లో తెలుగు పాఠకులకు, దేశ, విదేశాల్లో  అందరికీ తెలిసిన వ్యవహారమే. ఉమ్మడి “తెలుగుదేశం”లో నాలుగు దశాబ్దాలుగా ఎన్ని పత్రికలు వచ్చాయనేది బహిరంగ రహస్యమే. తెలుగు రాష్ట్రాల్లో “ఈనాడు” వెలుగు, జిలుగులకు ఒక్క రామోజీ ఆలోచనలే కారణం అన్నట్టు ఆయన మరణానంతరం  విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. కానీ,”ఈనాడు” శీర్షికలు, వ్యాసాలు, సంపాదకీయాలు తదితరాల వెనుక…

Read More
nda babu

సదా మీ సేవలో…

విజయవాడలో ఏ కనెక్షన్ లో కూటమి ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధినేతను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని శాసన సభ పక్ష నాయకునిగా ఎన్నుకున్నారు. చంద్రబాబు నాయుడు పేరును పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించగా పురంధరేశ్వరి, అచ్చెన్నాయుడు బలపరిచారు.అదేవిధంగా కూటమి ఎమ్మెల్యేలు దీనికి ఆమోదం తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, కూటమికి చెందిన ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Read More
IMG 20240317 WA0086

మాకే మీ ఓటు…!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలని, దేశంలో ఈసారి 400 సీట్లు దాటాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆంధ్ర్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా బొప్పూడిలో టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. “నా ఆంధ్ర కుటుంబసభ్యులు అందరికీ నమస్కారం” అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని మోదీ ప్రారంభించారు. దేశంలో ఈసారి ఎన్డీఏకు 400 సీట్లు దాటాలని, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలని మోదీ అన్నారు. అభివృద్ధి చెందిన…

Read More
chanakyam c

అంతుపట్టని”బాబు”చాణక్యం..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతోంది? ఒకప్పుడు జాతీయ రాజకీయాలను శాసించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాణక్యం ఎక్కడ దాచుకుంది? నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న”బాబు” కేవలం దశాబ్ద కాలంగా రాజకీయ తెరపై కనిపిస్తున్న అమిత్ షా కోసం ఎందుకు పడిగాపులు కాశారు? బాబు ఎన్.డి.ఏ. కన్వీనర్ గా  ఉన్నప్పుడు అసలు ఏం జరిగింది? ఆ పర్యవసానమే ప్రస్తుత ఫలితమా?  ఇలాంటి అనేక ప్రశ్నలకు ఆంధ్రా రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయి రాజకీయ…

Read More
24 c

24 అంటే 40-జనసేన “సినిమా” లెక్కలు…!

ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న శాసన సభ, లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి చేతులు కలిపిన తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఉత్కంఠకు తెరపడింది. రెండు పార్టీల మధ్య జరిగిన ఒప్పందంలో అక్కడున్న మొత్తం 175 నియోజక వర్గాలలో జనసేన కేవలం 24 స్థానాల్లోనే పోటీ చేయనుంది. అదేవిధంగా మూడు లోక్ సబ్ నియోజక వర్గాలలో “సేన” అభ్యర్ధులు బరిలోకి దిగుతారు. అయితే, ఇక్కడే “సైనికుల్లో” నిరాశ తలెత్తింది. అధికారమే లక్ష్యంగా, మార్పే…

Read More
babu shrmil

బాబు గారూ రావ్వాలి..

హైదరాబాద్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాలని చం వైఎస్ షర్మిల గాఆహ్వానించారు. అయన నివాసంలో వ్యక్తిగతంగా కలిసి షర్మిల బాబుకి పెళ్లి పత్రిక అందజేశారు.

Read More
IMG 20231222 WA0095

“బాబు” యాగం…

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో చండీయాగం, సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగే శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ది మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమంలో భాగంగా మొదటి రోజు యజ్ఞ క్రతువులు చేపట్టారు. ఉదయం 9 గంటల నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు జరిపారు. ప్రజలందరికీ మేలు జరగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా చంద్రబాబు – భువనేశ్వరి దంపతులు ప్రార్థించారు. గుంటూరుకు…

Read More
babu delhi c 1

డిల్లీలో “బాబు”…..!

సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరయ్యేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. ఆయనకు డిల్లీ విమానాశ్రయంలో టిడిపి నేతలు కనకమేడల రవీంద్రకుమార్,కేశినేని నాని,రఘురామ కృష్ణంరాజు, రామ్మోహన్ నాయుడు స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కు వెళ్ళారు.

Read More
yuvac

మళ్లీ జన”గళం’….!

ఆంధ్రప్రదేశ్ లో  ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ జనగళమే “యువగళం”గా యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 79రోజుల సుదీర్ఘ విరామానంతరం మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టబోతోంది. జగన్మోహన్ రెడ్డి అరాచకపాలన, అవినీతి బాగోతాన్ని ఎండగడుతున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు నైపుణ్య అభివృద్ధి కేసులో  జైలుకు  వెళ్ళడంతో అనివార్య పరిస్థితుల్లో సెప్టెంబర్ 9వ తేదీన కోనసీమలోని రాజోలు నియోజకవర్గం పొదలాడ వద్ద యువనేత లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. తర్వాత దేశ రాజధాని డిల్లీలో జగన్మోహన్…

Read More
jagan babu.jpg c

అటు“బెయిల్”బలం – ఇటు అసహనం…!

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి బెయిల్ మంజూరు కావడం అక్కడి ప్రధాన ప్రత్యర్ధి వైసిపి నేతలకు మింగుడు పడడం లేదా? బాబు అరెస్టుకు అనేక ఆధారాలు ఉన్నాయంటున్న అధికార పార్టీ నేతలు, కేసు నమోదు చేసిన సిఐడి అధికారులు కోర్టు విశ్వాసాన్ని కోల్పోయారా? ఆరోపణలకు తగిన ఆధారాలు చూపడంలో పోలీసు అధికారులు, విచారణ సంస్థ విఫలమైందా? బాబుకు బెయిల్ రావడంతో వైసిపి నేతల్లో అసహనం ఎందుకు పెరిగింది? తెలుగు రాష్ట్రాల ప్రజల్లో సోమవారం…

Read More
babu 3

చంద్రబాబుకి బెయిల్

ఆంధ్రప్రదేశ్ నైపుణ్య శిక్షణ సంస్థ కేసులో అరెస్టు అయిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ఈ రాష్ట్ర హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం అయన మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. ఈనెల 28న మధ్యంతర బెయిల్ ముగిసినా గానీ చంద్రబాబు ఇక రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కానీ, ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరు కావాలని హైకోర్టు సూచించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌…

Read More
IMG 20231015 WA0030

“న్యాయానికి సంకెళ్లు”…

అంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టు “న్యాయానికి సంకెళ్లు” అంటూ నారా లోకేష్, బ్రాహ్మణి నినదించారు. హైదరాబాద్లోని తమ నివాసంలో చేతులకు తాళ్లు కట్టుకుని చంద్రబాబు అక్రమ అరెస్టుని నిరసించారు. ఏ ఆధారాలు లేకపోయినా, రాజకీయ కక్షతో, ప్రజల నుంచి చంద్రబాబుని దూరం చేసేందుకు అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. వ్యవస్థలను చేతుల్లోకి తీసుకొని చంద్రబాబుని జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంచి ప్రాణహాని తలపెట్టాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. జైలులో ఆరోగ్యం…

Read More
rjy jail c

ఆ జైలులో ఏం జరుగుతోంది…!

గతంలో ఎన్నడూ లేని విధంగా రాజమండ్రి కేంద్ర కారాగారం కేవలం కొన్ని రోజులుగానే వార్తల్లోకి ఎక్కుతోంది? దోమల మూలంగా ఒక ఖైదీ చనిపోవడం, ఖైదీల మధ్య గొడవలు తలెత్తడం వంటి ఘటనలు ఈ మధ్యనే ఎందుకు జరుగుతున్నాయి. ఇలా గతంలో కూడా జరిగినా ఆ సమాచారం బయటకు పొక్కలేదా ? మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండడంతో ప్రతీ ఒక్కరిలో ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జైలులో జరుగుతున్న సంఘటనలపై అక్కడ విధులు…

Read More