artical C

అప్పుడు ఆర్టికల్ గుర్తుకు రాలేదా..!

రాజ్యాంగం లోని ఆర్టికల్ 19 ని ఆధారం చేసుకొని నీతు చెప్పడం కాదు, ప్రజా వేదికలపై మాట్లాడే సమయంలో ఎలా ప్రవర్తించాలనేది కూడా ముఖ్యం. వ్యక్తిగత ప్రయోజనాలకంటే, ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలి. నైతిక బాధ్యత అంటే అదీ. హక్కుల విలువ ఇవ్వడం అంటే అదీ. అంతేగానీ, నేను ఏది మాట్లాడినా చెల్లుబాటు కావాలి,  ఎదుటి వాడు ఏది చెప్పినా అదీ మనకు అనుకూలంగా ఉండాలనే ఆలోచన పరమ దుర్మార్గం. ప్రజా ప్రతినిధిగా ఎన్నికై, బాధ్యత గల హోదాలో…

Read Full News
babu devlp c

ఒకరిది అభివృద్ధి .. ఇంకోకరిది పంతం…!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో అగ్రనేతల మధ్య పనితీరు గమ్మత్తుగా కనిపిస్తోంది. పరిపాలనలో దిట్టగా పేరున్న  తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం తాపత్రయ పడుతుంటే, టిడిపి సానుభూతితో సీట్లు దక్కించుకున్న జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాత్రం తన పార్టీని కాపాడుకునే పనిలో పడ్డారు. వివిధ సంస్థలతో చర్చలు జరిపి, వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడం కోసం చంద్రబాబు సింగపూర్ వెళ్తే, దేశ సమగ్రత కోసం పోరాడటం మా సైనికుల…

Read Full News
cover

అహం..పతనం.. అదే “సనాతనం”..!

అమ్ము కోవడం కోసం పార్టీలు పెట్టడం,పదవుల కోసం సిద్ధాంతాలు, లక్ష్యాలను తుంగలో  తొక్కడం  ఒకప్పటి ప్రజారాజ్యం, నేటి  జనసేన పార్టీలకే సొంతం. రంగు పూసుకున్న మొహాలు చూసే ప్రేక్షకులు తమను నాయకులుగా ఎన్నుకుంటారనే అత్యాశతో  రాజకీయ పార్టీలు పెట్టడం పారిపోయింది. తమిళనాడులో ఎంజీఆర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి అప్పటి పరిస్థితులే కారణం. అంతేకాదు, ఆ నాయకుల నిబద్ధత, ప్రజలకు సేవ చేయాలనే పట్టుదల కూడా వాళ్లను వెండితెర నుంచి జనంలోకి నడిపించాయి. పార్టీ సిద్ధాంతాలను వాళ్ళు ఎన్నడూ విస్మరించలేదు,…

Read Full News
pawan

ఈ “తిక్క”కు లెక్క ఏంటి…!

ఎవరైనా సరే బహిరంగంగా, అదీ జన సమూహం మధ్య ఆయుధాలు అంటే కత్తులు, తుపాకులు వంటి ప్రమాదకరమైన మారణాయుధాలు చేత పట్టడం,  వాటిని ప్రదర్శించడం చట్ట పరంగా తీవ్రమైన నేరం. అలాంటి వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు. కానీ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ కి మాత్రం అవేమీ వర్తించినట్టు కనిపిస్తోంది. దీనికి కారణం ఆయనకు ఆంధ్రాలో ఉన్న “పవర్” అహమా లేక తెలంగాణ పోలీసులపై గౌరవం లేక పోవడమా అనే ప్రశ్నలు…

Read Full News
pavn pc

లోపల జాగ్రత్త…

సరిహద్దుల్లో సైనికులు ఎంత భద్రంగా దేశాన్ని రక్షిస్తున్నారో,  దేశం లోపల అంతర్గత భద్రతలో పోలీసు శాఖ కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండటం కీలకమనీ,  దీనిపై రాష్ట్ర పోలీసులను, పరిపాలన సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, దక్షిణాది రాష్ట్రాలు ఉగ్రవాదుల సున్నితమైన లక్ష్యం అఅనే విషయం గతంలో జరిగిన కిరాతక దాడుల్లో తేలిపోయిందన్నారు. కోయంబత్తూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడులు తల్చుకుంటే ఇప్పటికీ గుండె తరుక్కుపోతుందని…

Read Full News
posani c

“రాజా”, దర్శకుడు ఎవరు?..!

“రాజా” పోసాని, రాజకీయాలు అంటే వెండితెరపై నటన అనుకున్నారా, కానే కాదు, సినిమాల్లో దర్శకుడు చెప్పినట్టు చేస్తే “నటన” పండుతుంది, కళామతల్లి కరుణిస్తుంది, నలుగురి మెప్పు దక్కుతుంది. కానీ, రాజకీయాల్లో నటిస్తే “పాపం” పండుతుంది. అధికార పక్షం ఆడుకుంటుంది. అందుకే రాజకీయాల్లో మాత్రం సొంత తెలివి అవసరం. ఏమి చేయాలో ఆలోచించాలి, రాసుకోవాలి, అమలు చేయాలి ఇవీ రాజకీయ నాయకుల లక్షణాలు. ఇతరుల స్క్రిప్ట్ ని అనుసరిస్తూ, “రాజకీయ దర్శకుల” సూచనలు పాటిస్తూ నటిస్తే ఇలాగే జైలు…

Read Full News
sena ycp

నిలకడ లేని “పవన్”…

పవన్ కళ్యాణ్ ని నమ్ముకుంటే అందర్ని రోడ్డునపడేసి నట్టేట ముంచుతాడని జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ కు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పసుపులేటి సందీప్,జనసేన పార్టీ రాయలసీమ రీజియన్ సమన్వయకర్త పసుపులేటి పద్మావతిలు ఆరోపించారు.ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో వారు వైయస్సార్ సిపిలో చేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వైఖరిపై పలు ప్రశ్నలు కురిపించారు. అందర్ని ప్రశ్నిస్తానని,రాజకీయాలలో మార్పు తెస్తానని చెప్పే పవన్ లో నిలకడలేదని, ధైర్యం…

Read Full News
pawan 56

“కమల”దళంతో కనిపించని “తమ్ముడు”…!

తెలంగాణ శాసన సభ ఎన్నికల తేదీ సమీపిస్తున్నా ప్రచారంలో జనసేన జాడ కనిపించక పోవడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదుర్చుకొని తొమ్మిది నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ప్రచార తెరపై కనిపించక పోవడంతో ఆ పార్టీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నాయి.  రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజక వర్గాల్లో భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీలు ప్రచారంలో దూసుకు పోతుంటే జనసేనా కనీసం…

Read Full News
pawan kishan manohar

మళ్ళీ“మోడీ”రావాలి…!

దేశానికి నరేంద్ర మోడీ ఇంకోసారి ప్రధానమంత్రి కావలసిన ఆవశ్యకత ఉందని, ముచ్చటగా మూడోసారి మోడీ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనాలని ఆహ్వానం అందినట్టు తెలిపారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ “ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్న జనసేన పార్టీ జీహెచ్ఏంసీ…

Read Full News
babu pavan

టిడిపి-“సేన”లో పొత్తు చిచ్చు..!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ రాజకీయ పార్టీల పొత్తుల వ్యవహారం గందరగోళంగా మారుతోంది. పెద్ద పార్టీలతో చేతులు కలుపుతున్న పార్టీల వ్యూహాలు సామాన్యులకు అంతు పట్టడం లేదు. గత ఎన్నికలలో అంటకాగిన పార్టీలు ఈ సారి ఎడమొహం పెడమొహంగా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ శత్రువులుగా మారాయి. తెలంగాణ, అంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రాలో బిజెపితో కలిసి తిరిగిన జనసేన ఈ సారి రూటు మార్చింది. మొన్నటి వరకు…

Read Full News
jagan babu pawan

“కురుక్షేత్రం”లో ద్రౌపది ఎవరో…

అంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వింత పోకడలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక పార్టీ పై మరో పార్టీ అడ్డూఅదుపూ లేని ఆరోపణలకు దిగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో రాయలసీమ శైలిలో, మరికొన్ని సార్లు బెజవాడ తరహాలో ప్రసంగాలు సాగుతుంటే, ఇంకొన్ని సభల్లో ఏకంగా సినిమా డైలాగులను మరిపించే విధంగా మాటల తూటాలు పేలుతున్నాయి. తెలుగుదేశం నేతలపై మంత్రి రోజా చేస్తున్న ఘాటైన విమర్శలకు అదే స్థాయిలో  రోజాపై టిడిపి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో…

Read Full News