IMG 20240118 WA0009

వడ్డీ రాయితీ…

పేదలందరికి ఇళ్లు పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఇప్పటివరకు 4,500.19 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు అందించినట్లు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. వీటిపై లబ్ధిదారులు చెల్లెస్తున్న వడ్డీ మొత్తాన్ని ఏడాదికి రెండు విడతలుగా అందిస్తున్నట్లు వివరించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన వడ్డీ రీయింబర్స్ మెంట్ కార్యక్రమంలో అర్హులైన 4,07,323 లబ్దిదారులకు రూ.46.90 కోట్ల వడ్డీ రాయితీ మొత్తాన్ని విడుదల చేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఒక్కో ఇంటి స్థలం మార్కెట్ విలువ ప్రాంతాన్ని…

Read More
cec andhra

ప్రజాస్వామ్య బద్ధంగా..

పార్లమెంట్ ఎన్నికల కోసం భారత ఎన్నికల కమీషన్ పెద్దఎత్తున సన్నాహాలు చేస్తోందని భారత ప్రధాన ఎన్నికల కమీషనర్ ఎస్ హెచ్ రాజీవ్ కుమార్ అన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికల నిర్వహణకు ఇంకా ఏమి చేయాలనే దానిపై వాటాదారులతో సమీక్ష, సంప్రదింపుల కోసం తొలిగా ఆంధ్రప్రదేశ్ ను సందర్శించామన్నారు. రాష్ట్ర పర్యటనలో ఉన్న భారత ఎన్నికల కమీషన్ బృందం గత 3 రోజులుగా అన్ని రాజకీయ పార్టీలు, కలెక్టర్లు, ఎస్పీలు మరియు సిఎస్, డిజిపితో సహా ప్రభుత్వ సీనియర్…

Read More
IMG 20231208 WA0011

ఆంధ్రాలోనూ అహంకార రాజ్యమే..!

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై అంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోరు విప్పారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నేతృత్వం లోని భారత రాష్ట్ర సమితిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తెనాలి నియోజక వర్గం నందివెలుగులో తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అహంకారం ఉంటే ఏమవుతుందో తెలంగాణలో చూశామన్నారు. ఆంద్రప్రదేశ్ లో కూడా జగన్‌ ప్రభుత్వం అహంకారంతో ఉందని వ్యాఖ్యానించారు.

Read More
IMG 20231127 WA0027

“మౌని”వత్వం..!

మానవత్వం అంటూ మాట్లాడడం వేరు, దాన్ని చాటుకోవడం వేరు. మాట్లాడే వారు చాలా మంది ఉంటారు, కానీ మానవతావాదులు కొందరే ఉంటారు. అలాంటి ఔదార్యం శ్రీకాకుళం జిల్లాలో కనిపించింది. ఈ ఎచ్చెర్ల మండలానికి చెందిన రైతు గోవిందరావు, ఉమాదేవి దంపతుల కుమార్తె మౌనిక (23) వీఆర్వోగా పనిచేస్తున్నారు. ఈ నెల 23వ తేదీన ఆమె ద్విచక్ర వాహనంపై వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయపడింది. వైద్యులు బ్రెయిన్ డెడ్ అని ప్రకటించడంతో గుండె, కిడ్నీలు, కళ్లు…

Read More
chadalavd 1

మరో 11 పాలిటెక్నిక్ కాలేజీలు…

ఆంధ్రప్రదేశ్ లో రానున్న రెండు నెలల్లో మరో 11 పాలిటెక్నిక్ లకు ఎన్‌బీఏ లభించే అవకాశం ఉందని, ఇందుకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయని సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. నేషనల్ బోర్డు ఆప్ అక్రిడిటేషన్ గుర్తింపు సాధనలో భాగంగా చేస్తున్న కార్యక్రమాలు ప్రభుత్వ పాలిటెక్నిక్ లకు నూతనత్వాన్ని ఆపాదిస్తున్నాయన్నారు. విద్యార్ధులకు ఉపాధి ఏ మేరకు లభిస్తుందన్న దానిని కూడా ఎన్‌బీఏ పరిగణనలోకి తీసుకుంటుదని, ఆక్రమంలో వారికి తక్షణం ఉద్యోగాలు లభించేలా చర్యలు…

Read More
IMG 20231126 WA0021

తిరుపతిలో మోడీ…

తిరుపతి ప్రధాని నరేంద్ర మోదీ ఆంద్రప్రదేశ్ పర్యటనలో భాగంగా తిరుపతి వచ్చారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వాగతం పలికారు.

Read More
murm 3

పుట్టపర్తికి రాష్ట్రపతి…

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 22వ తేదీ శ్రీసత్య సాయి జిల్లా పుట్టపర్తి సందర్శించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ వీడియో సమావేశం ద్వారా సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 22న మధ్యాహ్నం 12.30 గం.లకు బెంగుళూరు నుండి భారత వాయుసేన విమానంలో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి చేరుకుని అక్కడి…

Read More
boat cf

విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో సంభవించిన అగ్ని ప్రమాదంలో మత్యకారులకు చెందిన సుమారు 40 బోట్లు కాలి బూడిద అయ్యాయి. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన హార్బర్ కు చేరుకొని మంటలు అదుపు చేసారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధిండిన కారణాలు తెలియలేదు. మత్స్యకారుల బోట్లు దగ్ధమైన ఘటనపై సీఎం వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని ఆదేశించారు. మంత్రి సీదిరి అప్పలరాజును ఘటనాస్థలానికి వెళ్లాలని…

Read More
rahul vja

“పినపాక” కు రాహుల్..

తెలంగాణ శాసన సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఖమ్మం జిల్లా పినపాకకు చేరుకున్నారు. జైపూర్ నుండి ప్రత్యేక విమానం లో ఆంధ్రప్రదేశ్ గన్నవరం విమానాశ్రయం చేరుకున్న రాహుల్ గాంధీకి అక్కడి కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. అనంతరం రాహుల్ హెలికాప్టర్ లో గన్నవరం నుండి ఖమ్మం జిల్లా మణుగూరు సమీపంలోని పినపాక బయలుదేరి వెళ్ళారు.

Read More
jagan puttaparti

పుట్టపర్తిలో జగన్…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీ సత్య సాయి జిల్లాలో మొట్ట మొదటి సారిగా రైతు భరోసా బహిరంగ సభకు హాజరయ్యారు. పుట్టపర్తి విమానాశ్రయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ వారు ఘనంగా స్వాగతo పలికారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ రత్నాకర్ఆ, జగన్ ల ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.

Read More
tdp logo 1

“దేశం”పయనం ఎటు…!

నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న తెలుగదేశం పార్టీ ఎవరూ ఊహించని రీతిలో తొలిసారి ఎన్నికల బరికి దూరమైంది. వచ్చే నెలలో జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీకి మొహం చాటేయడంతో రాజకీయ పరిశీలకులు సహా సామాన్య జనం ఒక్కసారిగా విస్తుపోయారు. తెలంగాణలోని అనేక జిల్లాల్లో అంకితభావంతో పనిచేస్తున్న క్యాడర్,  కొన్నినియోజక వర్గాల్లో ఇప్పటికీ పట్టు సడలని ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ తెలుగుదేశం పోటీకి దూరం కావడం ఆ పార్టీ మనుగడను మరింత దెబ్బతీసే అవకాశం…

Read More
IMG 20231028 WA0007 1

విశాఖలో వి.పి.,…

ఆంధ్రా మెడికల్ కాలేజీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఉప రాష్ట్రపతి జగ్ దిప్ ధన్ కర్ విశాఖపట్నం చేరుకున్నారు. ఐ.ఎన్.ఎస్. డేగా ఎయిర్ బేస్ కి చేరుకున్న ఆయనకు అంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వాగతం పలికారు.

Read More
jagana police c

“ఖాకీ” అంటే త్యాగనిరతి…

పోలీసులు వేసుకునే ఖాకీ డ్రెస్ అంటేనే త్యాగనిరతికి నిలువెత్తు సాక్ష్యం అనీ, పోలీస్‌ అంటే అధికారం మాత్రమే కాదనీ, సమాజంలో అతను ఒక బాధ్యత గల వ్యక్తీ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. నేరం వేగంగా తన రూపాన్ని మార్చుకుంటున్న ఈ యుగంలో అంతకుమించిన వేగాన్ని అందుకుంటేనే పోలీసింగ్‌కు మరింత విలువ పెరుగుతుందన్నారు. జన రక్షణ…

Read More
IMG 20231015 WA0030

“న్యాయానికి సంకెళ్లు”…

అంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టు “న్యాయానికి సంకెళ్లు” అంటూ నారా లోకేష్, బ్రాహ్మణి నినదించారు. హైదరాబాద్లోని తమ నివాసంలో చేతులకు తాళ్లు కట్టుకుని చంద్రబాబు అక్రమ అరెస్టుని నిరసించారు. ఏ ఆధారాలు లేకపోయినా, రాజకీయ కక్షతో, ప్రజల నుంచి చంద్రబాబుని దూరం చేసేందుకు అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. వ్యవస్థలను చేతుల్లోకి తీసుకొని చంద్రబాబుని జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంచి ప్రాణహాని తలపెట్టాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. జైలులో ఆరోగ్యం…

Read More
IMG 20231012 WA0000

జగన్ ని కట్టడి చేయండి..

అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కక్షసాధింపు చర్యలను కట్టడి చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి  అమిత్ షాకు నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. చంద్రబాబును అరెస్ట్, విచారణ పేరుతో వేధిస్తున్న  తీరును అమిత్ షా దృష్టి కి తీసుకు వెళ్లారు.చివరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి ని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. .

Read More