రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 22వ తేదీ శ్రీసత్య సాయి జిల్లా పుట్టపర్తి సందర్శించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ వీడియో సమావేశం ద్వారా సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 22న మధ్యాహ్నం 12.30 గం.లకు బెంగుళూరు నుండి భారత వాయుసేన విమానంలో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి చేరుకుని అక్కడి నుండి ప్రశాంతి నిలయానికి చేరుకుని అక్కడ జరిగే శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ కేంద్రం 42వ స్నాతకోత్సవంలో పాల్గొంటారన్నారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను జవహర్ రెడ్డి ఆదేశించారు.
పుట్టపర్తికి రాష్ట్రపతి…
