తప్పు కదా….

నిబంధనలకు విరుద్ధంగా జూనియర్‌ అసిస్టెంట్‌ను ఉద్యోగంలో నుంచి తొలగించిన వ్యవహారంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు నవీన్‌ మిత్తల్‌, వాకాటి కరుణతో పాటు ఇంకొందరు అధికారులకు కోర్టు ధిక్కరణ కింద హైకోర్టు శిక్ష విధించింది. ఒక్కొక్కరు రూ.10 వేల చొప్పున జరిమానా చెల్లించాలని,  ఆ మొత్తాన్ని  4 వారాల్లో చెల్లించకుంటే  నెల రోజుల సాధారణ  జైలుశిక్ష అనుభవించాలని ఆదేశించింది. ఐఏఎస్‌ల తో పాటు . కళాశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు జి.యాదగిరి, కల్వకుర్తి ప్రభుత్వ మోడల్‌ డిగ్రీ…

Read More
modi paspor

ప్రధాని ఇంటిపై డ్రోన్…

న్యూ దిల్లీలో నో ఫ్లై జోన్ పరిధిలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాసం పై డ్రోన్ కలకలం రేపింది. దీని పై ఎస్ పి జి అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.

Read More

కత్తులతో “రాక్” డాన్స్…

బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 లోని రాక్ క్లబ్  స్కైలాంజిలో కొందరు యువకులు డాన్సింగ్ ఫ్లోర్ పై  కత్తులు తిప్పుతూ నృత్యాలు చేశారు. పార్టీ కి వచ్చినవారు  భయంతో వణికిపోయారు.

Read More

ఎంత ఘోరం…

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. బుల్దానాలోని ఎక్స్‌ప్రెస్‌ వే పై వెళ్తున్న ఓ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 26 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 32 మంది ప్రయాణికులతో యావత్మాల్​ నుంచి పుణెకు వెళ్తుండగా శనివారం వేకువజామున 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మంటలు వ్యాప్తికి  బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. క్షతగాత్రులను బుల్దానా…

Read More

“రా” కి కొత్త గూడచారి…

భారత  భద్రతకు సంబంధించిన ప్రతిష్టాత్మక గూడచార సంస్థ అయిన రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌ (“రా”) చీఫ్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి రవి సిన్హా నియమితులయ్యారు. రవి నియామకాన్ని  మంత్రి మండలి నియామకాల కమిటి ఆమోదించింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1989 ఐపీఎస్ బ్యాచ్, ఛత్తీస్ ఘడ్ క్యాడర్ కు చెందిన రవి సిన్హా ప్రస్తుతం “రా”లో రెండో సీనియర్…

Read More

కేసుల ఎత్తివేత ….

పౌర హక్కుల నేత ప్రొఫెసర్‌ హరగోపాల్‌ సహా ఇతరులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) కింద నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. వెంటనే కేసుల ఎత్తివేతకు తగు చర్యలు తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్‌ను సీఎం ఆదేశించారు. మావోయిస్టు కార్యకలాపాలకు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై హరగోపాల్‌తో పాటు ఇతర ప్రజాసంఘాల నేతలపై ఉపా చట్టం కింద తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంటి తప్పు చేయకపోయినా, ఆధారాలు లేకుండా ఉపా చట్టం…

Read More

లంచం తో చిక్కిన వి.సి. రాజేందర్…

తెలంగాణ వర్సిటీ ఉపకులపతి(వీసీ) దాచేపల్లి రవీందర్ అవినీతి నిరోధక శాఖ (అనిశా) వలలో చిక్కారు. తార్నాకలోని తన నివాసంలో రూ.50వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. భీంగల్‌లో పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం ఆర్మూర్ లోని శ్రీ షిర్డిసాయి ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు  దాసరి శంకర్ అనే వ్యక్తి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.అరెస్టు చేసి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తలించారు.

Read More
Screenshot 2023 06 17 140328

ఎర్ర చందనం స్మగ్లింగ్ కథేంటి…

రాష్ట్రంలో ఎర్ర చందనం, ఇతర అటవీ ఉత్పత్తుల స్మగ్లింగ్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్  హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.  ఎప్పుడో దశాబ్దాల క్రితం నమోదైన కేసుల్లో ఇప్పటి వరకు  చార్జిషీట్ దాఖలు చేయకపోవడంపై  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.  అటవీ సంపద అక్రమాలపై సమగ్ర దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటుచేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఆదేశాలు  జారీ చేసింది.  సివిల్ కోర్టుకు ఉండే అన్ని అధికారాలు సిట్‍కు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ…

Read More