డైరెక్ట్ ఫ్లైట్ ప్లీజ్…
భారత్ -అమెరికాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటకం కోసం ప్రపంచ గమ్యస్థానంగా హైదరాబాద్ ఆకర్షణను మరింత పెంచేందుకు హైదరాబాద్ నుంచి నేరుగా అమెరికాకు విమాన సర్వీసులు ఏర్పాటు చేయాలని యూఎస్ఎ ఎన్నారైలు అబిప్రాయపడ్డారు. ఈ మేరకు అమెరికాలో పర్యటిస్తున్న కిషన్ రెడ్డికి తెలుగు ఎన్నారైలు కలిసి తమ విజ్ఞప్తిని లేఖ రూపంలో అందించారు. ఢిల్లీ, ముంబై వంటి అనేక నగరాలు ఇప్పటికే అమెరికాలోని ప్రధాన నగరాలకు నేరుగా విమాన సర్వీసులను కలిగి ఉన్నాయని, అమెరికా నుండి హైదరాబాద్‌కు…
