ఈ “తిక్క”కు లెక్క ఏంటి…!
ఎవరైనా సరే బహిరంగంగా, అదీ జన సమూహం మధ్య ఆయుధాలు అంటే కత్తులు, తుపాకులు వంటి ప్రమాదకరమైన మారణాయుధాలు చేత పట్టడం, వాటిని ప్రదర్శించడం చట్ట పరంగా తీవ్రమైన నేరం. అలాంటి వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు. కానీ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ కి మాత్రం అవేమీ వర్తించినట్టు కనిపిస్తోంది. దీనికి కారణం ఆయనకు ఆంధ్రాలో ఉన్న “పవర్” అహమా లేక తెలంగాణ పోలీసులపై గౌరవం లేక పోవడమా అనే ప్రశ్నలు…
