గుడిని కూల్చడం సాధ్యమా…?

bjp wrong cf

నాలుగు వందల స్థానాలు గెలుస్తామని ఢంకా బజాయించి మరీ ప్రచారం చేస్తున్న భారతీయ జనతా పార్టీ అధినేతల మాటల్లో అవేశం కనిపించడం ఆశ్చర్య పరుస్తోంది. దేశంలో మూడో దశ పోలింగ్ పూర్తీ అయిన తర్వాత నరేంద్ర మోడీ, అమిత్ షా, ఆధిత్యనాథ్ లాంటి భాజాపా నేతల ప్రసంగాల్లో ఉహించని మార్పు కనిపిస్తోంది. ఈ నేతలు “ఇండియా కూటమి” పైనా, ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ మీద విసురుతున్న ఘాటైన విమర్శనాస్త్రాలు రాజకీయ పరిశీలకులను ఆలోచనల్లో పడేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ గాని, ఇండియా కూటమి గానీ అధికారంలోకి వస్తే అయోధ్యలో రామ మందిరాన్ని బుల్డోజర్ లతో నేల మట్టం చేస్తారనడం అంతుపట్టకుండా ఉంది. కాంగ్రెస్ పార్టీ పారిశ్రామిక విధానాలు మావోయిస్టుల మాదిరిగా ప్రమాదకర సిద్ధాంతం లాంటివని ప్రధాని మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేయడం మేధావులకు సైతం అర్ధం కానీ విషయం. మూడో సారి ఎలాగైనా నెగ్గి తీరాలనే పట్టుదలతో మోడీ, ఆయన బృందం ఓట్లు రాబట్టుకునే ఎత్తుగడలలో భాగంగా ముననెన్నడూ లేని విధంగా వ్యవహారుస్తున్నారని అంచనా వేస్తున్నారు.

 ముదిరిన “మోడీ” ఆరోపణలు..

ayodyamandir

1992వ సంవత్సరంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అయోధ్యలో కరసేవకులు బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన వాస్తవాన్ని మోడీ విస్మరించి ఉంటారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దేశంలో 130 కోట్ల మందికి పైగా ఉన్న హిందువుల మనోభావాలను కాదని గుళ్ళు, గోపురాలను కులగొట్టడానికి ఏ ప్రభుత్వము, రాజకీయ పార్టీ సాహసించవని వివరిస్తున్నారు. అనేక ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీకి దేశంలో దేవవాలయాలు కులకగొట్టిన చరిత్ర లేదని కాంగ్రెస్ నేతలు తిప్పి కొడుతున్నారు.

wrong in

అదేవిధంగా దేశాన్ని పాలించే అర్హత భాజాపాకి మాత్రమే ఉన్నదనే రీతిలో అమిత్ షా ప్రసంగాలు సాగడం గమ్మత్తుగా ఉంది. దేశాన్ని పరిపాలించడం అంటే కిరాణా దుకాణం నడిపినట్టు కాదని వ్యాఖ్యానించడం ఆశ్చర్యకర విషయం. అంతేకాక, ముస్లిమ్ మైనారిటీల రిజర్వేషన్ల వ్యవహారం పైనా అమిత్ షా మొదటి దశ పోలింగ్ సమయంలో చేసిన పొంతనలేని  ప్రసంగాలు, వివరణలు భాజాపా శ్రేణులనే అయోమయానికి గురి చేయడం గమనార్హం. మొన్నటికి మొన్న కేజ్రీవాల్ కి సుప్రీమ్ కోర్టు బెయిల్ మంజూరు చేయడం పై కూడా షా వ్యాఖ్యలు చేయడం కూడా న్యాయ రంగ నిపుణుల విమర్శలు ఎదుర్కొన్నాయి. అన్ని కోణాలను పరిశీలించినా తర్వాతే ఆ బెయిల్ మంజూరు చేసినట్టు చివరికి సుప్రీమ్ కోర్టు ప్రకటించాల్సి వచ్చింది.

IMG 20240521 WA0006

కాంగ్రెస్, ఆర్జేడీలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటాలను కొల్లగొట్టి ముస్లింలకు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అధిత్యా నాథ్ కుల, మత పరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మరో వివాదం. అంతేకాదు, ముంబై పేలుళ్లు జరిగినప్పుడు కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉందని, అప్పుడే ఉగ్రవాదులు సరిహద్దు దాటి భారత్‌లోకి వచ్చారని పొంతన లేకుండా విమర్శించడం కూడా ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే మాటలే అని విపక్షాలు పేర్కొంటున్నాయి. భాజాపా నేతలు ఎన్నికల ప్రచారంలో లేవనెత్తుతున్న అంశాలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమే అంటూ సిపిఎం నేత సీతారాం ఏచూరీ ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం గమనార్హం.

karge

ఈ ఎన్నికల్లో రామ మందిర అంశం లేక పోవడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా భాజాపా ప్రచార అస్త్రాలను వెతుక్కుంటోందని, ఇందులో భాగంగానే ప్రతిపక్షాలపై విరుసుకుపడితూ, సామాన్య జనాన్ని రెచ్చగొట్టే వ్యూహాలు రచిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున్ తేల్చి చెబుతున్నారు. రామ మందిరం పేరుతో అంచలంచెలుగా ఎదిగి అధి కారంలోకి వచ్చిన కాషాయ పార్టీకి గుడి నిర్మాణం పూర్తీ కావడంతో ఈ ఎన్నికల్లో ప్రచార అస్త్రం కరువైందని, అందుకే జనాన్ని ఆకర్షించడం కోసం ఇలాంటి ఎత్తుగడలు వేస్తోందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

2 thoughts on “గుడిని కూల్చడం సాధ్యమా…?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *