kohli 100

క్రికెట్ లో “విరాట్”పర్వం…!

విరాట్ కోహ్లీ వ‌న్డే క్రికెట్లో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. ముంబై వాంకడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జ‌రిగిన వ‌ర‌ల్డ్‌క‌ప్ సెమీస్‌ పోరులో కోహ్లీ సెంచ‌రీ చేసి వన్డేల్లో 50వ శ‌త‌కం పూర్తి చేశాడు. విరాట్ 106 బంతుల్లో , 100 ర‌న్స్ చేసి సెంచ‌రీ సాధించాడు. ఈ సెంచ‌రీతో వ‌న్డేల్లో స‌చిన్ 20౦౩ వ సంవత్సరంలో నమోదు చేసిన అత్య‌ధిక శ‌త‌కాల (49) రికార్డును విరాట్ బ‌ద్ద‌ల‌కొట్టాడు. ఇరవై ఏళ్లుగా భారత్ పేరిట ఉన్న రికార్డుని మళ్ళి భారత…

Read More
in new c

మహా సమరానికి ఒక్క అడుగు….

వన్డే వరల్డ్‌ కప్‌ దాదాపు చివరి దశకు చేరుకుంది. స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో నాకౌట్‌ మ్యాచ్‌కు భారత్ సిద్ధమైంది. మొదటి నుంచి వరుస విజయాలతో ఊపు మీదున్న రోహిత్‌ సేన అదే ఊపుతో కివీస్‌ను ఓడించాలని భావిస్తోంది. బ్యాటింగ్‌లో బ్యాటర్లు అదరగొడుతుండగా బౌలింగ్‌లో పదునైన పేస్‌తో పేసర్లు ప్రత్యర్థి బ్యాటర్లను బెదరగొడుతున్నారు. స్పిన్నర్లు బ్యాటర్లను కట్టడి చేస్తుండగా ఫీల్డర్లు మైదానంలో చురుగ్గా కదులుతున్నారు. ఇలా ఎటు చూసినా ఏ విభాగంలో చూసినా టీమిండియా చాలా పటిష్టంగా…

Read More
IMG 20231112 WA0103

దీపావళి ధమాకా….

చెన్నై చిన్నస్వామి స్టేడియంలో భారత క్రికెటర్లు దీపావళి మోత మోగించారు. ప్రపంచ కప్పు ఆటల్లో భాగంగా నెథర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 411 పరుగుల భారీ టార్గెట్ ని ఫిక్స్ చేసింది. రోహిత్ (61), గిల్ (51) పరుగుల రాకెట్లలా దూసుకెళ్లగా, కింగ్ కోహ్లి (51) సీమ టపాకాయిలా పేలాడు. శ్రేయస్ అయ్యర్ (128*), కేఎల్ రాహుల్ థౌజండ్ (102) పరుగుల వరద కురిపించారు. 62 బంతుల్లోనే కేఎల్ సెంచరీ చేయడం మరో విశేషం….

Read More
isha shooter

ఇషాకు స‌త్కారం

ఆసియా క్రీడ‌ల్లో ఒక స్వ‌ర్ణం స‌హా నాలుగు ప‌త‌కాలు సాధించిన తొలి భార‌త మ‌హిళా షూట‌ర్ ఇషా సింగ్‌ను ఎంఎల్ఆర్ఐటీ విద్యాసంస్థ‌ల చైర్మ‌న్ మ‌ర్రి ల‌క్ష్మ‌ణ్ రెడ్డి ఘ‌నంగా స‌త్క‌రించారు. ఎంఎల్ఆర్ఐటీలోని ఇండోర్ బ్యాడ్మింట‌న్ స్టేడియంను ఇషా సంద‌ర్శించి, అక్క‌డి టేబుల్ టెన్నిస్‌, బ్యాడ్మింట‌న్‌, అథ్లెటిక్స్‌, షూటింగ్, ఫెన్సింగ్ క్రీడాకారుల‌తో స‌ర‌దాగా ముచ్చ‌టించింది. ఈ సంద‌ర్భంగా వ‌ర్ధ‌మాన క్రీడాకారులు ఇషాను అడిగి ప‌లు విష‌యాలు తెలుసుకున్నారు. అనంత‌రం ఇషాను ల‌క్ష్మ‌ణ్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాస‌రావు, డీన్ రాధిక…

Read More
maxwel

“మాక్స్ వెల్” మెరుపులు..

ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన ప్రపంచ కప్పు మ్యాచ్ లో మరో సంచలన విజయం నమోదైంది. అఫ్గానిస్తాన్ పై ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలిచింది. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 46.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేరుకుంది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మాక్స్ వెల్ 201 మెరుపు పరుగులతో డబుల్ సెంచరీ చేయడం విశేషం. ఒకవిధంగా చెప్పాలంటే మాక్స్ వెల్ ఒంటి చేతితో ఆటను గెలిపించారని చెప్పవచ్చు.

Read More
sout india

దంచ్చుడే…

ప్రపంచ కప్పులో భారత్ విజయ పరంపర కొనసాగుతోంది. తాజాగా మరో అద్భుత విజయాన్ని అందుకుంది.కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో 243 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ బౌలర్ల దాడికి సఫారీ జట్టు 83 పరుగులకే చేతులెత్తేసింది.

Read More
IMG 20231029 WA0024 1

ఇంగ్లాండ్ చిత్తు…

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో లో జరిగిన ప్రపంచ కప్పు మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై భారత జట్టు 100 పరుగుల తేడా తో ఘన విజయం సాధించింది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు భారత్ బౌలర్లు విజృంభించడంతో 129 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ ప్లేయర్లలో లివింగ్ స్టోన్ (27) చేసిన పరుగులే అత్యధికం. భారత బౌలర్లలో షమీ 4, బుమ్రా 3, కుల్దీప్ 2, జడేజా ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో…

Read More
dalailama newzlnd

దలైలామాతో “కివీస్”…

ప్రపంచ కప్ ఆటల్లో ఉన్న న్యూజిలాండ్ ఆటగాళ్ళు భౌద్ధ మత ప్రముఖులు దలైలామాను ధర్మశాల లోని ఆయన నివాసంలో కలిశారు. టీమ్ సభ్యులు తమ కుటుంబ సభయులతో లామా ఆశిస్సులు తీసుకున్నారు.

Read More

మరో విజయం…

ప్రపంచ కప్పు క్రికెట్ లో వరుస విజయాలతో భారత్ దూసుకు పోతోంది. ధర్మశాలలో జరిగిన ఆటలో న్యూజిలాండ్ పై భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 274 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ 48 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లి 95 పరుగులతో ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. కానీ, తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. అటు రోహిత్ 46, జడేజా 39*, శ్రేయస్ 33, రాహుల్ 27 రన్స్…

Read More
aus win

“పాక్” ఓటమి…

ప్రపంచ కప్ క్రికెట్ పోటీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 368 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ తడబడింది. పాక్ ఓపెనర్లు అబ్దుల్లా (64), ఇమాముల్(70), రిజ్వాన్(46) మాత్రమే రాణించారు. పాక్ 45.3 ఓవర్లలో 305 రన్స్ చేసి ఆలౌట్ అయ్యింది.దీంతో ఈ వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాకు వరుసగా రెండో విజయం దక్కింది. మరోవైపు పాకిస్తాన్‌ వరుసగా 2వ ఓటమి చవిచూసింది.

Read More
IMG 20231016 WA0000

“అఫ్గాన్” అద్భుతం….

వన్డే ప్రపంచ కప్‌లో సంచలనం. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు అఫ్గానిస్థాన్ షాక్ ఇచ్చింది. ఇంగ్లాండ్ పై 69 పరుగులతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ ఇంగ్లాండ్ ముందు 285 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కానీ, ఇంగ్లాండ్ ను 215 పరుగులకే కట్టడి చేసింది. హ్యారీ బ్రూక్ (66), డేవిడ్ మలన్ (32) మినహా అందరూ విఫలమయ్యారు. రెహ్మాన్ 3, నబి 2, రషీద్ 3, ఫరూఖీ, నవీన్ ఉల్ హక్ తలో వికెట్…

Read More
IMG 20231014 WA0086 1

అలవోకగా…

అహ్మదాబాద్ లో జరిగిన ప్రపంచ కప్ వన్డే లో పాకిస్తాన్ పై భారత్ సునాయాస విజయన్ని సొంతం చేసుకుంది. టాస్ గెలచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 42.5 ఓవర్లకే 10 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. భారత్ జట్టు 30.3 ఓవర్లలో 192 పరుగులు చేసి గెలుపొందింది. దీంతో ప్రపంచ కప్ 2023 పట్టికలో భారత్ మొదటి స్థానానికి చేరుకుంది.

Read More
IMG 20231014 WA0070

మహిళల రైడింగ్…

ఒకప్పుడు తాగునీటికి అవస్థలు పడిన మహబూబ్ నగర్ నేడు విదేశీ పర్యాటకులను సైతం విశేషంగా ఆకర్షిస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సహకారంతో మహబూబ్ నగర్ ను అద్భుతంగా తీర్చిదిద్దడం వల్లే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఫ్రెంచ్ మోటార్‌ సైక్లిస్ట్ అలిసన్ గ్రున్ ఆధ్వర్యంలోని ఫ్రీ డబ్ల్యూ అనే వేదిక ద్వారా తెలంగాణలో ఫ్రాన్స్,…

Read More
hca

హెచ్‌సీఏలో సందడి షురూ..

ప్రతిష్టాత్మకమైన అదేవిధంగా వివాదాస్పదమైన హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సీఏ) ఎన్నిక‌ల్లో అధ్య‌క్షుడిగా పోటీ చేసేందుకు అర్శ‌న‌ప‌ల్లి జ‌గ‌న్‌మోహ‌న్ రావు, అత‌డి ప్యానెల్ స‌భ్యులు నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. ఉప్ప‌ల్ స్టేడియంలో నామినేష‌న్లు స‌మ‌ర్పించిన అనంత‌రం జ‌గ‌న్‌మోహ‌న్‌ రావు త‌మ ప్యానెల్ పేరును ప్ర‌క‌టించారు. యూనైటెడ్ మెంబ‌ర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానెల్ నుంచి అధ్య‌క్షుడిగా జ‌గ‌న్‌మోహ‌న్ రావు, ఉపాధ్య‌క్షుడిగా పి.శ్రీధ‌ర్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఆర్‌. హ‌రినారాయ‌ణ, స‌హాయ కార్య‌ద‌ర్శిగా నోయ‌ల్ డేవిడ్ (మాజీ క్రికెట‌ర్‌), కోశాధికారిగా సి.జె శ్రీనివాస్‌,…

Read More