ఇషాకు స‌త్కారం - EAGLE NEWS

ఇషాకు స‌త్కారం

isha shooter

ఆసియా క్రీడ‌ల్లో ఒక స్వ‌ర్ణం స‌హా నాలుగు ప‌త‌కాలు సాధించిన తొలి భార‌త మ‌హిళా షూట‌ర్ ఇషా సింగ్‌ను ఎంఎల్ఆర్ఐటీ విద్యాసంస్థ‌ల చైర్మ‌న్ మ‌ర్రి ల‌క్ష్మ‌ణ్ రెడ్డి ఘ‌నంగా స‌త్క‌రించారు. ఎంఎల్ఆర్ఐటీలోని ఇండోర్ బ్యాడ్మింట‌న్ స్టేడియంను ఇషా సంద‌ర్శించి, అక్క‌డి టేబుల్ టెన్నిస్‌, బ్యాడ్మింట‌న్‌, అథ్లెటిక్స్‌, షూటింగ్, ఫెన్సింగ్ క్రీడాకారుల‌తో స‌ర‌దాగా ముచ్చ‌టించింది. ఈ సంద‌ర్భంగా వ‌ర్ధ‌మాన క్రీడాకారులు ఇషాను అడిగి ప‌లు విష‌యాలు తెలుసుకున్నారు. అనంత‌రం ఇషాను ల‌క్ష్మ‌ణ్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాస‌రావు, డీన్ రాధిక క‌లిసి స‌న్మానించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *