ఐనా దొరికారు…

హైదరాబాద్ శంషాబాద్  విమానాశ్రయంలో  కస్టమ్స్, ఎయిర్ ఇంటలిజెన్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. ఒక ప్రయాణికుని కోటి 37లక్షలు రూపాయల  విలువైన 2.279 కిలోలు బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిక్కర్ లో పట్టిలో దాచిన బంగారాన్ని అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు.  అదే విధంగా లక్ష రూపాయలకు  పైగా విలువ చేసే  విదేశీ సిగిరెట్లు స్వాధీనం చేసుకున్నారు.

Read More

100 కోట్లు ఎక్కడివి సంజయ్….

గత ఎన్నికల్లో పుస్తెలు అమ్మి పోటీ చేసిన బండి సంజయ్‌కి  టివిలు, పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడానికి 100 కోట్ల రూపాయలు  ఎక్కడి నుంచి వచ్చాయని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర, జాతీయ అధ్యక్షులపై ఆ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన కీలక వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి.   పుస్తెలు అమ్మి పోటీ చేసిన బండి సంజయ్‌కి ప్రకటనలు ఇవ్వడానికి రూ.100 కోట్లు ఎక్కడివని ప్రశ్నించారు. పార్టీ…

Read More
akhil

చర్చలు…

ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో భేటీ అయ్యారు. ప్ర‌స్తుతం నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై ఇద్ద‌రు చర్చించారు. బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్ర‌త్యేక విమానంలో చేరుకున్న అఖిలేష్ యాద‌వ్‌కు మంత్రులు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, ప్ర‌శాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అక్కడి నుంచి నేరుగా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు చేరుకున్నారు.

Read More
rahul kmm

మోడీ చేతిలో కేసిఆర్…

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రిమోట్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతిలో ఉందని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్ అంటే బిజెపి బంధు పార్టీ అని ఎద్దేవా చేశారు. సిఎల్పి నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ పాల్గొన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ కనుసన్నలలోనే ఇక్కడి  బిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేతోందని దుయ్యబట్టారు. పార్లమెంటులో మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతాంగ వ్యతిరేక బిల్లుకు…

Read More
jnj c

మీరే యజమానులు…  

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిజాంపేట్‌, పేట్‌ బషీరాబాద్‌ లోని 70 ఎకరాల స్థలం జేఎన్‌జే సొసైటీకే చెందుతుందని, ఈ భూమి కోసం సభ్యులందరూ డబ్బులు చెల్లించినందున ఆ భూమికి జేఎన్‌జే సొసైటీ సభ్యులే యజమానులని హైకోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌ చంద్రకుమార్‌​ స్పష్టం చేశారు. టీమ్‌ జేఎన్‌జే ఆధ్వర్యంలో జరిగిన  జవహర్‌ లాల్‌ నెహ్రూ జర్నలిస్టుల మ్యూచువల్‌ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ సభ్యుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.  సుప్రీంకోర్టు తీర్పు ‍ప్రకారం జేఎన్‌జే…

Read More

కత్తులతో “రాక్” డాన్స్…

బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 లోని రాక్ క్లబ్  స్కైలాంజిలో కొందరు యువకులు డాన్సింగ్ ఫ్లోర్ పై  కత్తులు తిప్పుతూ నృత్యాలు చేశారు. పార్టీ కి వచ్చినవారు  భయంతో వణికిపోయారు.

Read More
revanth pongu

దూకుడే….

కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో దూకుడు పెంచింది. కర్ణాటక ఎన్నికల తర్వాత అటు ఏపీ, ఇటు తెలంగాణలో ముమ్మరంగా  కార్యక్రమాలు చేపడుతోంది. కొన్ని రోజులు క్రితం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయగా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేపట్టారు. పీపుల్స్ మార్చ్ పేరుతో దాదాపు 109 రోజులు పాటు ఆయన ప్రజల్లో తిరిగారు. ప్రస్తుతం భట్టి చేపట్టిన పాదయాత్ర ఆదివారంతో ముగియనుంది. ఈ సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు…

Read More
inter

మూసీపై ఎక్స్‌ప్రెస్‌వే…

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం లో భాగంగా  మూసీ నదిపైన ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణాన్ని చేపడతామని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌   చెప్పారు. హైదరాబాద్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డుపై నార్సింగి వద్ద 29.50 కోట్ల రూపాయల  వ్యయంతో నిర్మించిన ఇంటర్‌ ఛేంజ్‌ను మంత్రి  ప్రారంభించారు.     ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ  మురుగు నీటిని పునర్వినియోగించే పాలసీని తీసుకురానున్నట్టు,  సెప్టెంబర్‌ నాటికి హైదరాబాద్‌లో మురుగునీరు శుద్ధీకరణ పూర్తవుతుందని తెలిపారు. ఔటర్ చుట్టూ పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా  సర్వీస్‌ రోడ్లను విస్తరించాలనే  సీఎం…

Read More
rahul

రాహుల్ రాక…

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు ఖమ్మంలో జరగనున్న భారీ బహిరంగ సభకు హాజరవుతున్నారు. ఆయన రేపు సాయంత్రం ప్రత్యేక విమానంలో విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో ఖమ్మంకు బయల్దేరుతారు. సీనియర్ నేత మల్లు భట్టివిక్రమార్క పాదయాత్ర ముగింపును సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సభలో భట్టిని రాహుల్ గాంధీ సత్కరించనున్నారు. ఇదే సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్…

Read More

9న మహాంకాళి బోనం …

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగను వైభ‌వంగా నిర్వ‌హించేలా అన్ని ఏర్పాట్లు చేయాల‌ని మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ అధికారుల‌ను ఆదేశించారు బోనాల ఏర్పాట్లు, నిర్వహణపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాద‌వ్  అధికారులతో డా.బీఆర్. అంబేడ్క‌ర్ స‌చివాల‌యంలో స‌మీక్ష నిర్వ‌హించారు. బోనాలు ఉత్సవాల నిర్వహణపై అధికారులకు దిశా నిర్దేశనం చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రులు మాట్లాడుతూ  తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతి…

Read More

సతాయింపు చాలు…

ప్రధాని మోడీ శుభవార్తతో తెలంగాణకు రావాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.  ఈ నెల 8 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తున్నా సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.  తొమ్మిది ఏళ్లుగా తెలంగాణను కేంద్రం నానా రకాలుగా సతాయిస్తోన్నదని, హైదరాబాద్ లో లింక్ రోడ్లు, స్కైవేల కోసం ఆర్మీ భూములు ఇచ్చేలా మోడీ ఆదేశాలు ఇవ్వాలివ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయని, ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజాక్షేత్రంలో ఆ సంగతి తేల్చుకోవచ్చు…

Read More

ఏం జరుగుతోంది…

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మీద లైంగిక దాడి ఆరోపణలు చేసిన షేజాల్ జూబ్లీ హిల్స్ రోడ్ 36లోని దసపల్లా హోటల్ జంక్షన్ వద్ద నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసింది. ఎంత వాదించినా తనకు న్యాయం జరగదంలేడనే మనస్తాపంతో ఆత్మహత్య యత్నం చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఆమెను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read More

ఏమిటీ దుస్థితి…

గొప్ప చరిత్ర కలిగిన ఉస్మానియా ఆస్పత్రి దుస్థితి చూస్తే ఆందోళన కలుగుతోందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి సంబంధించి గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలుపుకోవాలని కోరుతూ ‘జస్టిస్ ఫర్ ఓజీహెచ్’ పేరుతో ఉన్న ఓ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఆస్పత్రిలో రోగులు పడుతున్న ఇబ్బందులకు సంబంధించిన ఫొటోతో పాటు.. కొత్త భవన నిర్మాణానికి జాయింట్ అసోసియేషన్ విడుదల చేసిన లేఖకు సంబంధించిన ఫొటోలు ట్వీట్‌కు జత…

Read More