cht cm vistnudev

విష్ణుదేవ్‌ కి”ఛత్తీస్‌”పగ్గాలు…

చత్తీస్‌గఢ్‌ నూతన ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్‌సాయ్ ఎన్నికయ్యారు. చత్తీస్‌గఢ్‌ శాసన సభ బిజెపి పక్ష నేతగా విష్ణుదేవ్‌సాయ్ ని ఎన్నుకున్నారు. రమణ్‌సింగ్‌ ముఖ్యమంత్రి పదవి దక్కుతుందనే ఉహాగానాలకు బిజెపి మాజీ ఎంపీ విష్ణుదేవ్‌సాయ్‌ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎంపిక చేసింది.

Read More
laknw

లక్నో కాదు ..”లక్ష్మణ పురి”…!

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో పేరు మారింది. ఇప్పటి నుంచి దాన్ని “లక్ష్మణ పురి”గా వ్యవహరిస్తారని అధిత్యానాద్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Read More
babu delhi c 1

డిల్లీలో “బాబు”…..!

సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరయ్యేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. ఆయనకు డిల్లీ విమానాశ్రయంలో టిడిపి నేతలు కనకమేడల రవీంద్రకుమార్,కేశినేని నాని,రఘురామ కృష్ణంరాజు, రామ్మోహన్ నాయుడు స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కు వెళ్ళారు.

Read More
IMG 20231126 WA0021

తిరుపతిలో మోడీ…

తిరుపతి ప్రధాని నరేంద్ర మోదీ ఆంద్రప్రదేశ్ పర్యటనలో భాగంగా తిరుపతి వచ్చారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వాగతం పలికారు.

Read More
babu 3

చంద్రబాబుకి బెయిల్

ఆంధ్రప్రదేశ్ నైపుణ్య శిక్షణ సంస్థ కేసులో అరెస్టు అయిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ఈ రాష్ట్ర హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం అయన మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. ఈనెల 28న మధ్యంతర బెయిల్ ముగిసినా గానీ చంద్రబాబు ఇక రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కానీ, ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరు కావాలని హైకోర్టు సూచించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌…

Read More
IMG 20231112 WA0000

“వర్గీకరణ” కమిటీ..

ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రధానినరేంద్ర మోడీ ప్రకటించారు. సికింద్రాబాద్ పరేడ్ మైదనంలో జరిగిన ‘మాదిగల విశ్వరూప మహాసభ’లో మోడీ మాట్లాడారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ స్వప్నాన్ని తాము నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. వర్గీకరణకు సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియ సుప్రీంకోర్టులో ఉందని, దానికి తాము మద్దతిస్తున్నామని పేర్కొన్నారు. మాదిగల ఉద్యమాన్ని గుర్తించానని, గౌరవిస్తున్నానని హామీ ఇచ్చారు. దళిత వర్గాలకు క్షమాపణ చెప్పడానికే మాదిగల సభకు వచ్చానని ప్రధాని మోడీ తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత…

Read More
modi advani

మీ ఆశీర్వాదం…

రాజకీయ కురువృద్ధులు, భారతీయ జనతా పార్టీ అగ్ర నేత, మాజీ కేంద్ర మంత్రి లాల్ కిషన్ అద్వాని 96 వ జన్మదినం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాద్ సింగ్ తదితరులు అద్వాని నివాసానికి వెళ్ళారు. పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Read More
chtisghd 1pol

మొదటి దశ ప్రశాంతం…

ఛత్తీస్ ఘడ్ లో తొలి దశలో 20 స్థానాలకు జరిగిన పోలింగ్ లో 70.87 శాతం ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఇది 6శాతం తక్కువని ఎన్నికల కమిషన్ అధికారి తెలిపారు. కాగా, ఛత్తీస్ ఘడ్ లో మిగతా 70 స్థానాలకు రెండో దశ పోలింగ్ ఈ నెల 17న జరగనుంది.మరోవైపు మిజోరంలో 40 స్థానాలకు గానూ పోలింగ్ సమయం ముగిసే సరికి 77.04 శాతం ఓటింగ్ నమోదైంది.

Read More
samaria

సమాచార కమిషనర్”సమారియా”…

సీనియర్ ఐఏఎస్ అధికారి హీరాలాల్ సమారియా భారత సమాచార ముఖ్య కమిషనర్ గా నియమితులైయ్యారు. ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టారు. సమారియా సింగరేణి డైరెక్టర్ గా పనిచేశారు. విద్యుత్ రంగంలో ప్రస్తుత సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వంలో కార్మిక శాఖ విభాగంలో పని చేసి అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. రాజస్థాన్ రాష్ట్రం భారత్ పూర్ కి చెందినా హీరాలాల్ సమారియా ఉమ్మడి రాష్ట్రం లోని…

Read More
IMG 20231028 WA0005

తప్పక రావాలి…

వచ్చే ఏడాది అయోధ్యలో చేపట్టే శ్రీ రాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలని శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఆహ్వానం ఇచ్చింది. జనవరి నెలలో జరిగే ప్రతిష్టకు రావలసిందిగా ట్రస్ట్ సభ్యులు ప్రధానిని కలిసి మొదటి ఆహ్వాన పత్రిక అందజేశారు.

Read More
IMG 20231024 WA0060

పిల్లర్లు కుంగడమా…!

అధికారులకే అంతుపట్టని కారణంతో ఆశ్చర్యంగా కుంగిపోయిన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని కేంద్ర బృందం పరిశీలించింది. రెండు రోజుల కిందట కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీ 20వ పిల్లర్ వద్ద కుంగిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని ఈ కమిటీ బ్యారేజీని పరిశీలించింది.19, 20, 21వ పిల్లర్ల వద్ద పగుళ్లకు గల కారణాలను అన్వేషించింది….

Read More
dowal kangana

పిక్చర్ పర్ఫెక్ట్…

కేంద్ర ప్రభుత్వ జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ ప్రయాణిస్తున్న విమానంలో బాలీవుడ్ భామ కంగనా రనౌట్ కూడా జర్నీ చేశారు. ఆ విమానంలో దోవల్ తో కలిసి దిగిన సెల్ఫీని కంగనా సోషల్ మీడియాలో పంచుకుంది.

Read More
Gaganyaans test

“క్రూ” సేవ్ టెస్ట్ సక్సెస్…

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గగన్‌యాన్ మిషన్‌ డెమో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. 44 టన్నుల బరువైన ఫ్లైట్ టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్-1 టి.వి.- డి1 రాకెట్ షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 10 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ లో  క్రూ మాడ్యూల్, ఎస్కేప్ మాడ్యూల్‌ని నింగిలోకి పంపారు.ఈ ప్రయోగంలో రాకెట్ తనలో ఉన్న క్రూ మాడ్యూల్, క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ను భూమి నుంచి 17 కిలోమీటర్ల…

Read More
Gaganyaans test

గగన్ యాన్ “డెమో”ప్రయోగం..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలు పెట్టింది. 21వ తేది ఉదయం 8 గంటలకు “గగన్ యాన్” మిషన్ కి సంబంధించిన డెమో వెహికల్-1ని నింగిలోకి పంపనున్నారు. గగన్ యాన్ ప్రయోగంలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే అందులోని సిబ్బంది ఎలా తప్పించుకోవచ్చు అనే విషయాలను ఈ ప్రయోగం ద్వారా తెలుసుకోవచ్చునని ఇస్రో తెలిపింది.

Read More
rapid train

ర్యాపిడ్ “ఎక్స్”…

దేశంలో మొట్టమొదటి “ర్యాపిడ్ ఎక్స్” ప్రాంతీయ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 20వ తేదీన ప్రారంభిస్తారు. డిల్లీ, ఘజియాబాద్,మీరట్ ల మధ్య మొదట ఈ రైలు నడుపుతారు. పూర్తీ ఎయిర్ కండిషన్ బోగిలతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ రైలు గంటకు 16౦ కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.ప్రయాణికులు కూర్చోవడానికి,నిలబదదానికీ విశాలంగా ఉంటుంది. అంతేకాక,ప్రతీ బోగిలో సి.సి. కెమెరా అమర్చారు. లాప్ టాప్, మొబైల్ ఫోన్ లను చార్జింగ్ చేసుకునే సదుపాయం ఉంది.

Read More