ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ బిల్డింగ్ మన దేశంలోనే ప్రారంభం కాబోతోంది. వజ్రాల పరిశ్రమకు పేరెన్నికగన్న గుజరాత్ రాష్టంలోని సూరత్ నగరంలో ఈ బిల్డింగును నిర్మించారు. సూరత్ డైమండ్ బోర్స్ (SDB) భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 17న ప్రారంభించనున్నారు. దాదాపు 3500 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ భవనం 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి, దాదాపు 4500 డైమండ్ ట్రేడింగ్ ఆఫీసులు ఏర్పాటు చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ భవన నిర్మాణం ఫిబ్రవరి 2015 లో ప్రారంభమైంది.