హైదరాబాద్ లోని కార్వన్ పరిధిలోని మెహబూబ్ కాలనీ లో విచ్చలవిడిగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న వారి గురించి తెలుసుకోవడానికి వెళ్ళిన విద్యుత్ శాఖ ఉద్యోగులపై ఆ ప్రాంత వాసులు దాడికి పాల్పడ్డారు. కాలనీలోకి అడుగు పెట్టగానే కొందరు వ్యక్తులు ఉద్యోగులపై పిడిగుద్దులతో దాడికి దిగారు. ఆ ప్రాంతంలో ప్రాబల్యం ఉన్న రాజకీయ పార్టీకి చెందినా వారే ఈ దాడికి పాల్పడ్డట్టు సమాచారం. బర్కాస్, కార్వాన్ ప్రాంతాల్లో అనేక మంది అక్రమంగా విద్యుత్తు వినియోగం చేస్తున్న విషయం తెలిసి కూడా ఇలాంటి దాడుల వల్ల అధికారులు విచారణకు వెళ్ళలేక పోతున్నారు.