“తమ్ముడి”తో జనంలోకి ఎలా వెళ్ళాలి….

pellikoduku C
babu swanin

మూడో విడాకుల తర్వాత చంద్రబాబు తన పరిపాలన పై ప్రజల్లో విశ్వసనీయత, టిడిపి భవిష్యత్ గురించి ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. ఎన్టీఆర్ వివాదానికి సంబంధించి ఒక్క అంశం మినహా తెలుగు రాష్ట్రాల్లో  ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలన తిరుగు లేనిదనే భావం ప్రజల్లో ఉంది. ఆయన నాయకత్వం లోని టిడిపి పై ఆ పార్టీ నాయకులు, శ్రేణులో 30 ఏళ్లుగా గట్టి నమ్మకం ఉంది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో రెండో సారి కూడా అధిక మెజారిటీతో బాబుకి అక్కడి ప్రజలు అధికారం కట్టబెట్టారు. అందుకే జనం నమ్మకాన్ని బాబు బాధ్యతగా తీసుకొని రకరకాల అభివృద్ధి పనులతో ముందుకు వెళ్తున్నారు. దీనికి అండగా కేంద్రం లోని మోడీ ప్రభుత్వం సహకరిస్తోంది. ఇలాంటి తరుణంలో పవన్ కల్యాణ్ విడాకుల వ్యవహారం కూటమిలో తలనొప్పికి దారితీసేలా మారిందని టీడీపీ, భాజపా సీనియర్ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం లేదా కూటమి పార్టీల తరఫున ఏవైనా కార్యక్రమాల్లో మోడీ, చంద్రబాబులతో కలిసి పవన్ పాల్గొనాల్సి వస్తే ఇబ్బంది తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో పవన్ ని పక్కన పెట్టుకొని ప్రజలకు హామీలు ఇచ్చే సాహసం చేయడం టిడిపి, భాజపా అగ్ర నేతలకు చాలా కష్టం అనే వాదనలు పుంజుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ సైతం ఆత్మ న్యూనత భావంతో ప్రజల మధ్య నీతులు వల్లించే ప్రసంగాలు చేసే అవకాశం ఉండదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఈ సారి ఆంధ్రప్రదేశ్ లో జరిగే శాసనసభ, లోక్ సభ ఈ రెండు ఎన్నికలు ఇటు చంద్రబాబుకి మాత్రమే కాక కేంద్రంలో మోడీకి కూడా అత్యంత కీలకం. వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రాలో లోకేష్ ని పీఠం పైకి తీసుకురావడానికి బాబు ప్రయత్నం కాగా, కేంద్రంలో నాలుగో విడత భాజపా జెండా ఎగరాలి అనేది మోడీ ఆలోచన. ఇంతటి కీలక సమయం, ఎన్నికల సమరాల్లో పవన్ కల్యాణ్ తో జోడీ కట్టడం ఏ మేరకు ఫలితం ఇస్తుందనేది అగ్ర నేతల చర్చల్లో ప్రధాన అంశం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *